స్టార్ హీరోల వద్దు..చిన్న హీరోలు ముద్దు అంటున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్

May 16, 2019 at 2:43 pm

దిల్ రాజు స్టార్ ప్రొడ్యూస‌ర్‌. చిన్నా పెద్ద హీరో అనే తార‌త‌మ్యం లేకుండా వారితో సినిమాలు నిర్మిస్తాడు. పెద్ద హీరోల‌తో భారీ బ‌డ్డెట్ చిత్రాలు తీస్తుంటాడు. చిన్న హీరోల‌తో లో బ‌డ్జెట్ సినిమాలు తీస్తూ అంద‌రివాడుగా ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకున్నాడు. అలాంటిది దిల్ రాజుకు ఇప్పుడు పెద్ద హీరోల‌తో పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. చిన్న హీరోల‌తో ఎలాంటి చీకు చింతా లేకుండా సినిమాలు చేసుకుంటూ లాభాల‌తో కాలం గ‌డిపే ఈరోజుల్లో పెద్ద హీరోల‌తో సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటూన్నాన‌నే భావ‌న‌లో దిల్ రాజు ఉన్నాడ‌ని లోకం అంటుంది.

అస‌లు విష‌యానికి వ‌స్తే దిల్ రాజు ఇటీవ‌ల పెద్ద హీరోల‌తో అనేక సినిమాలు చేసి భారీ బ‌డ్జెట్ సినిమాలు తీసాడు. ఇవి ఇప్పుడు దిల్ రాజుకు భారంగా మారాయి. ఇటీవ‌లే విడుద‌లైన మ‌హ‌ర్షి సినిమా అనుకున్నంత మేర‌కు లాభాలు తెచ్చిపెట్ట‌లేద‌నే భావ‌న‌లో దిల్ రాజు ఉన్నాడ‌ట‌. పెద్ద పెద్ద హీరోల‌తో సినిమాలు చేసి భారీ బ‌డ్జెట్ పెడితే అవి లాభాలు ఇవ్వ‌కుండా నామ‌మాత్రంగానే ఆడుతున్నాయ‌ట‌. భారీ చిత్రాలు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటూ , ఎక్కువ బ‌డ్జెట్ అవుతూ, అన‌వ‌స‌ర‌మైన త‌ల‌నొప్పులు , న‌ష్టాలే త‌ప్ప లాభాలు రావ‌డం లేద‌ని తెగ మ‌ద‌న ప‌డిపోతున్నాడ‌ట‌. అందుకే పెద్ద హీరోల‌కు గుడ్‌బై చెప్పాల‌ని ఆలోచిస్తున్నాడ‌ట‌.

ఇక‌పోతే దిల్ రాజు చిన్న హీరోల‌తో సినిమాలు చేస్తే హాయిగా నిద్ర పోవ‌చ్చ‌ట‌. మూడొంద‌ల కోట్లు పెట్టి తీసిని సినిమా ఆవ‌రేజ్‌గా న‌డిస్తే అదే 30కోట్ల‌తో తీసిన సినిమాలు మూడొంతుల లాభాలు తెస్తున్నాయ‌ని దిల్ రాజు అభిప్రాయ‌మ‌ట‌. చిన్న సినిమాల‌తో టెన్ష‌న్ త‌క్కువ‌. లాభాలు ఎక్కువ‌ట‌. ఇటీవ‌ల తీసిని ఎఫ్‌2 30కోట్లు పెడితే 100కోట్ల‌దాకా వ‌సూలు చేసింద‌ట‌. పిధా లాదాంటి సినిమాల‌తో భారీ లాభాలే ఆర్జించొచ్చ‌ట‌. అందుకే ఇక‌ముందు చిన్న సినిమాల‌కే జై కొట్టాల‌ని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడని ఫిలిం స‌ర్కిల్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అందుకే దిల్ రాజు మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత రాజ్ త‌రుణ్, నాగ‌చైత‌న్య‌ల‌తో, ఇంద్ర‌గంటీ మోహ‌న‌కృష్ణ‌తో వి లాంటి సినిమాలు తీసి త‌క్కువ ఖ‌ర్చు ఎక్కువ లాభం పొంద‌వ‌చ్చ‌నే ప్లాన్‌లో ఉన్నాడ‌ట‌. ఏదేమైనా పెద్ద హీరోల‌తో లాభాలు త‌క్కువ‌, చిన్న హీరోల‌తో లాభాలు ఎక్కువ అందుకే ఇకముందు పెద్ద హీరోల‌తో సినిమాలు చేయ‌కుండా చిన్న హీరోల‌తో సినిమాలు తీసి దిల్ దార్‌గా ఉండ‌వ‌చ్చ‌ని దిల్ రాజు ఆలోచ‌న‌. సో దిల్ రాజు ఆలోచ‌న ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే.

స్టార్ హీరోల వద్దు..చిన్న హీరోలు ముద్దు అంటున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share