ఎట్టకేలకు దానిపై స్పందించిన శంకర్

December 14, 2018 at 10:29 am

శంక‌ర్ చిత్రాల్లో దేనికైదే వైవిధ్యంతో ఆక‌ట్టుకున్న సినిమాలు. అయితే ఒకే ఒక్క‌డు సినిమా మాత్రం స‌మాజాన్ని చాలా ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసిన సినిమా. ఒక విలేఖ‌రికి 24గంట‌ల స‌మ‌యం పాటు సీఎంగా ప‌నిచేసే అవ‌కాశం వ‌స్తే ఏం చేశాడ‌న్న‌దే క‌థ‌. 1999లో వ‌చ్చిన ఒకే ఒక్క‌డు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అంతేకాక అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. తాజా క‌బురేంటంటే గ‌త కొంత‌కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే శంక‌ర్ నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న లేదు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న నోరు విప్పారు. శ్రుతిహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘హలో సాగా’ కార్యక్రమానికి శంకర్ ‌ముఖ్య అతిథిగా విచ్చేసి అనేక విషయాలను పంచుకున్నారు.

ఇందులో భాగంగా ‘ఒకే ఒక్కడు’కు సీక్వెల్‌ తీస్తే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించగా, ‘లీడ్‌ రోల్‌ చేయాల్సిన వ్యక్తి కాస్త పెద్దవాడిగా కనిపించాలి. అది రజనీ లేదా కమల్‌ అయితే బాగుంటుంది. ఒక వేళ స్క్రిప్ట్‌ యువకుడిని డిమాండ్‌ చేస్తే, విజయ్‌ని ఎంపిక చేసుకుంటా’ అని అన్నారు.
సీక్వెల్ ఉంటుందని స్ప‌ష్టం చేశారు. అయితే దానిక‌న్న ముందు ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా క‌మ‌ల్‌తో ఇప్ప‌టికే భార‌తీయుడు2 సినిమా తీసే ప‌నిలో శంక‌ర్ నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక రోబో సీక్వెల్‌గా 2.ఓను ర‌జ‌నీతో తెరకెక్కించారు. ఇక వీరిద్ద‌రిలో ఒక‌రిని ఏంచుకుంటే ర‌జ‌నీతో శంక‌ర్‌కు అది నాలుగో సినిమా అవుతుంది. ర‌జ‌నీతో శంక‌ర్ శివాజీని తెర‌కెక్కించారు. ఇక క‌మ‌ల్‌తో రెండో సినిమా అవుతుంది. మొద‌టి సినిమా భార‌తీయుడు కాగా ఇప్పుడు భార‌తీయుడు -2ను తెర‌కెక్కిస్తున్నారు.

ఇక ఒకే ఒక్క‌డులో కూడా క‌మ‌ల్ ఉంటే ఆయ‌న‌తో శంక‌ర్‌ది మూడో సినిమా అవుతుంది. ఇక విజ‌య్‌ను ఎంపిక చేసుకుంటే ఆ హీరోతో రెండో సినిమా అవుతోంది. గ‌తంలో స్నేహితుడు తీశారు. ఇది బాలీవుడ్ అమీర్‌ఖాన్ హీరోగా న‌టించిన త్రీ ఇడియ‌ట్స్‌ సినిమాకు రీమేక్‌. అయితే క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2సినిమాయే త‌న‌కు చివ‌రి చిత్ర‌మని ప్ర‌క‌టించ‌డం విశేషం. మ‌రి వ‌రుస‌గా ర‌జ‌నీతో సినిమాలు చేస్తున్న శంక‌ర్ ఈ అగ్ర‌న‌టుడితో తీస్తారా..?అన‌్న‌ది కూడా ఆలోచింప‌జేస్తున్న విష‌యం. అయితే క్యారెక్ట‌ర్ పెద్ద‌మ‌నిషిలా ఉండాల‌ని స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే త‌ప్ప‌ద‌ని తెలిపిన విషయం విదిత‌మే. చూడాలి శంక‌ర్ ఎవ‌రిని ఎంపిక చేసుకుంటారో.. ఇక రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘2.ఓ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లను రాబట్టినట్లు సినీ ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎట్టకేలకు దానిపై స్పందించిన శంకర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share