దుమ్మురేపుతోన్న “ఇస్మార్ట్ శంకర్ ” ప్రీ రిలీజ్ బిజినెస్‌

July 13, 2019 at 4:45 pm

ఎన‌ర్జీటిక్ హీరో రామ్ న‌టించిన సినిమా ఇస్మార్ట్ శంక‌ర్. ఈసినిమా విడుద‌ల‌కు ముందే ఫ్రి బిజినెస్‌లో దుమ్మురేపుతోంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్‌తో పాటుగా న‌టి చార్మీ సంయుక్తంగా నిర్మించారు. పూరీ టాకీస్‌పై నిర్మించిన ఈ సినిమా ఈనెల‌18న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. రామ్‌కు జ‌త‌గా నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ న‌టించారు.

అయితే ఈసినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఇప్ప‌టికే విడుద‌ల అయ్యాయి. ఈ టీజ‌ర్‌కు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. రామ్ కు ఓ మంచి హిట్ రావ‌డం, పూరి జ‌గ‌న్నాథ్ కేరీర్‌కు మ‌రోమారు ఇదో మైలురాయిగా నిలిచిపోనున్న‌ది. ఇక న‌టీ చార్మీకి కూడా నిర్మాత‌గా ఈ సినిమా ఓ తీపిగుర్తునే మిగ‌ల్చ‌నున్న‌ది. ఇక ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ఫ్రీ రిలిజ్ బిజినేస్ ఇప్ప‌టికే రూ.36.50కోట్ల‌కు జ‌రిగింద‌ట‌. ఇది రామ్ కేరీర్‌లోనే ఓ భారీ బిజినెస్ అట‌. అందుకే ఈ బిజినెస్‌తో రామ్‌కు ఎక్క‌డ లేని సంతోషం త‌న్నుకొస్తుంద‌ట‌.

ఈసినిమాకు సంబంధించిన ఫ్రీ రిలిజ్ బిజినెస్‌ను ఓమారు ఏరియా వారిగా చూస్తే థ్రియోటిక‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్‌తో రూ.17కోట్లు వ‌చ్చింద‌ట‌. ఒక్క నైజాంలోనే రూ.7కోట్ల‌ట‌. ఇలా రామ్ కేరీర్‌లో ఇస్మార్ట్ బిజినెస్ బెస్ట్ బిజినెస్ అయింద‌ట‌. ట్రైల‌ర్‌, టీజ‌ర్‌తోనే వ‌చ్చిన హైప్‌తో సినిమా ఇంత బిజినెస్ చేస్తే, సినిమా విడుద‌ల త‌రువాత ఈ సినిమా బాగుంటే మ‌రింత బిజినెస్ చేయ‌నున్న‌ద‌నే టాక్ వినిపిస్తుంది. ఈసినిమాకు పూరి జ‌గ‌న్నాథ్ మేకింగ్‌, మ‌ణిశ‌ర్మ సంగీతం, రామ్ న‌ట‌న‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ల హాట్ అందాలు ఈ సినిమాకు ప్ల‌స్ కానున్న‌ది.

దుమ్మురేపుతోన్న “ఇస్మార్ట్ శంకర్ ” ప్రీ రిలీజ్ బిజినెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share