రామ్ “ఇస్మార్ట్ శంక‌ర్” టీజ‌ర్ ‘

May 15, 2019 at 10:57 am

యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. 1.19 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్ మొత్తం పూరి పాత రొటీన్ మార్క్ టేకింగ్‌తో నింపేశాడు. కాక‌పోతే ఈ స్టైల్ రామ్‌కు మాత్ర‌మే కొత్త‌.  ఓల్డ్ సిటీ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అనే విషయాన్ని నేపథ్యంలో ఉండే చార్మినార్ మనకు మరోసారి గుర్తు చేస్తోంది. ప్రోమో పోస్టర్లు.. టైటిల్..  రామ్ గెటప్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నా అవ‌న్నీ గ‌తంలో పూరి సినిమాల్లో చూసేసిన‌వే. రామ్ డైలాగ్ డెలీవ‌రీ కాస్త కొత్త‌గా ఉన్న‌ట్టు అనిపిస్తోంది.

ఇక టీజ‌ర్‌తో క‌థ‌, క‌థ‌నాలు ఏ మాత్రం కొత్త‌గా ఉండ‌వ‌ని పూరి మ‌రోసారి తేల్చిచెప్పాడు. ఇప్ప‌టికే వ‌రుస‌గా డిజాస్ట‌ర్లలో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన పూరి నుంచి కొత్త‌ద‌నం ఆశించ‌డం మ‌న అత్యాశే అవుతుంద‌ని టీజ‌ర్‌తోనే చెప్పేశాడు. ఏతావాతా ఇస్మార్ట్ శంక‌ర్ ఏదేనా సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని ఆశించ‌లేం. ప్రేక్ష‌కుడిని రెండు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చోపెడితే ఏదైనా యావ‌రేజ్ అవ్వ‌డం మిన‌హా అంత‌కు మించి ఏం ఉండ‌ద‌ని తేలిపోయింది. పూరి ఏ మాత్రం మార‌లేదు కాదు కాదు.. మార‌న‌ని తేల్చేశాడు. 

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను మే నెల చివ‌ర్లో రిలీజ్ చేయాల్సి ఉండ‌గా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో జూన్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

రామ్ “ఇస్మార్ట్ శంక‌ర్” టీజ‌ర్ ‘
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share