‘ జై ల‌వ‌కుశ‌ ‘ ను టెన్షన్ పెడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల‌ను వేధిస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మూడు వ‌రుస సినిమాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నా, ఈ సినిమాకు అన్ని బాగానే ఉన్నా డైరెక్ట‌ర్ బాబి ట్రాక్ రికార్డు ఇప్పుడు అంద‌రిని టెన్ష‌న్ పెడుతోంది.

బాబి తొలి సినిమా ప‌వ‌ర్ అంత గొప్ప సినిమా కాదు. అది రొటీన్ స్టోరీ. ఏదో యావ‌రేజ్‌గా గ‌ట్టెక్కేసింది. ఇక బాబి క‌థ రాసిన సినిమాలు అంత గొప్ప సినిమాలు కావు. బాబి ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేసిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ పెద్ద డిజాస్ట‌ర్‌. ఓ పెద్ద హీరో ఇచ్చిన ఛాన్స్‌ను బాబి స‌రిగా వాడుకోలేద‌ని, పెద్ద హీరోల‌ను డీల్ చేయ‌డం బాబికి రాదా ? అన్న సందేహాలు చాలా మందికే ఉన్నాయి.

స‌ర్దార్ లాంటి డిజాస్ట‌ర్ ఉన్నా ఎన్టీఆర్ బాబికి ఛాన్స్ ఇవ్వ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. అయితే స‌ర్దార్ సినిమాకు పేరుకే బాబి డైరెక్ట‌ర్ అని, సినిమా అంతా ప‌వ‌నే తీసుకున్నాడ‌ని అందుకే సినిమా ప్లాప్ అయ్యింద‌ని ఓ టాక్ ఉంది. జై ల‌వ‌కుశ సినిమా విష‌యంలో ఎన్టీఆర్ క‌లుగ‌జేసుకోలేద‌ని సినిమా బాగా వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

మ‌రి జై ల‌వ‌కుశ సినిమాకు అన్ని బాగానే ఉన్నా ద‌ర్శ‌కుడి బ్యాడ్ సెంటిమెంట్ ఈ సినిమాకు వ‌ర్క్ అవుట్ అవుతుందా ? లేదా ఆ బ్యాడ్ సెంటిమెంట్ చిత్తు చేసి త‌న హిట్ల ప‌రంప‌ర కంటిన్యూ చేస్తాడా ? అన్న‌ది చూడాలి.