జెర్సీ ప్రీమియ‌ర్ షో టాక్‌..

April 19, 2019 at 10:58 am

నేచుర‌ల్ స్టార్ నాని- శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన‌ చిత్రం జెర్సీ. ఈ సినిమా ట్రైల‌ర్లు, టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించాయి. ఓ క్రికెట‌ర్ లైఫ్‌కు సంబంధించిన అంశాన్ని క‌థ‌గా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌. స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కించిన జెర్సీ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ప్ర‌తీ సినిమాకు ఏదో ఒక కొత్త అంశం ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డే హీరో నాని.. జెర్సీని అలాగే ఎంచుకున్నాడు. ఆయ‌న అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌య్యాయో ప్రీమియ‌ర్ షో టాక్ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

న్యూయార్క్ సిటీలో ఉంటున్న అర్జున్‌(నాని) కుమారుడు త‌న తండ్రి( నాని) లైఫ్ గురించి చెబుతుండ‌గా సినిమా ప్రారంభం అవుతుంది. 1996లో నాని త‌న భార్య సారా( శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌), కుమారుడితో క‌లిసి హైద‌రాబాద్‌లో ఉంటాడు. అలా మొద‌లైన క‌థ చాలా ఇంట్రెస్టింగ్ మూడ్‌తో సాగుతూ ఉంటుంది. 1980లో ఫామ్‌లో ఉన్న క్రికెట‌ర్ నాని. ఆ త‌ర్వాత అనుకోని కార‌ణాల‌తో ఆయ‌న ఆట‌కు దూర‌మ‌వుతాడు. ఆట‌లో మంచి ఫాంలో ఉన్న స‌మ‌యంలోనే క్రిష్టియ‌న్ మ‌తానికి చెందిన సారాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ త‌ర్వాత కుటుంబంలో ఆర్థిక స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయి.

నానికి 36ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టుకుంటాడు. ఎలాగైనా క్రికెట్ ఆడితీరాల‌న్న క‌సితో సాధ‌న చేస్తాడు. ఈ క్ర‌మంలో క‌థ‌లో ఎలాంటి మలుపులు వ‌చ్చాయి..? నాని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివ‌ర‌కు అనుకున్న‌ది ఎలా సాధించాడు..? అన్న‌ది మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి. ఇక ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మాత్రం క‌థ‌ను అద్భుతంగా న‌డిపించాడ‌ని చెప్పొచ్చు. ప్ర‌ధానంగా 1980-90 మ‌ధ్య కాలాన్ని క‌ళ్ల‌ముందుంచాడు. న్యూజిలాండ్‌, హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగే చారిటీ మ్యాచ్‌ను చాలా రియ‌లిస్ట‌క్‌గా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు.

మ‌ళ్లీ హైద‌రాబాద్ రంజీ జ‌ట్టులోకి నాని వ‌చ్చిన త‌ర్వాత ముంబ‌యి- హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను కూడా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ బాగా తెర‌కెక్కించాడు. ఇక నాని, శ్ర‌ద్ధ శ్రీ‌నాథ్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మ‌ధ్యలో కొంత బోరింగ్‌గా సాగినా.. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అద్భుతంగా న‌టించారు. అనిరుద్ అందించి సంగీతం ఈ సినిమాకు అద‌న‌పు బ‌లం అని చెప్పొచ్చు. మొత్తంగా నాని కెరీర్‌లోనే గుర్తుండిపోయే సినిమాగా జెర్సీ నిలిచిపోతుంద‌ని చెప్పొచ్చు.

జెర్సీ ప్రీమియ‌ర్ షో టాక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share