లైఫ్ గోల్ గాడి తప్పిన నాని “జెర్సీ ” ట్రైలర్ …

April 12, 2019 at 9:56 am

నేచురల్‌ స్టార్‌ నాని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న జెర్సీ చిత్రం ట్రైల‌ర్‌ శుక్ర‌వారం విడుద‌ల అయింది. ఈ సినిమాకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ నానికి జంట‌గా న‌టిస్తోంది. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. విభిన్న క‌థాంశాల‌తో ఎప్పుడూ కొత్త‌ద‌నంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే నాని.. ఈసారి కూడా అలాంటి క‌థాంశంతోనే వ‌స్తున్నారు.

జెర్సీ సినిమాకు సంబంధించిన అంత‌కుముందు విడుద‌ల అయిన టీజ‌ర్ కూడా ఈ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. క్రికెట‌ర్ జీవిత క‌థాంశంతో ఈ సినిమాను గౌత‌మ్ తెర‌కెక్కిస్తున్నారు. క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో శుక్ర‌వారం విడుద‌ల అయిన‌ ట్రైలర్‌ మొదలైంది.

పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని ఇందులో ప్ర‌ధానంగా చూపించారు. ‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్ పేలింద‌ని చెప్పొచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 19న ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

లైఫ్ గోల్ గాడి తప్పిన నాని “జెర్సీ ” ట్రైలర్ …
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share