బాల‌య్య, క‌ల్యాణ్‌రామ్‌కు దూరంగా తారక్ ఫ్యాన్స్‌..

March 4, 2019 at 2:58 pm

టాలీవుడ్ లో తార‌క్ అభిమానుల‌పై తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. నంద‌మూరి అభిమానుల్లో తార‌క్ అభిమానులు వేర‌యా..! అనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో తార‌క్ ఇమేజ్‌.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు నంద‌మూరి హీరోలు బాల‌కృష్ణ‌, క‌ల్యాణ్‌రామ్‌ల‌ను స‌పోర్ట్ చేయ‌డం లేదా..? అంటే ఇండ‌స్ట్రీవ‌ర్గాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఎందుకంటే.. ఇక్క‌డ కొన్ని ఈక్వెష‌న్స్ చూస్తే.. ఇది కాస్త వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గానే క‌నిపిస్తోంది.Balakrishna-Jr-NTR-Kalyan-Ram-1

బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన విన‌య విధేయ రామ సినిమా భారీ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఈ సినిమాపై పెద్ద లొల్లే జ‌రిగింది. అది ద‌ర్శ‌కుడు బోయ‌పాటి, హీరో రాంచ‌ర‌ణ్‌, నిర్మాతల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలిపోవ‌డానికి బోయపాటినే కార‌ణ‌మ‌ని మెగా ఫ్యామిలీ అభిమానులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఇదే స‌మ‌యంలో ఈ సినిమా రూ.60కోట్ల‌కుపైగానే వ‌సూలు చేసింది. అంటే.. మెగా ఫ్యామిలీ అభిమానులంతా స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పొచ్చు.06957a28676dbb69b0fc6f56c8ae4891

కానీ.. నంద‌మూరి ఫ్యాన్స్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి ఈ తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రేక్షకాద‌ర‌ణ పొంద‌లేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కూడా బోల్తా కొట్టింది. క‌నీస వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఒక‌వేళ‌.. తార‌క్ అభిమానులంతా కూడా స‌పోర్ట్ చేసి ఉంటే.. సినిమా ఎలా ఉన్నా ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని, వ‌సూళ్లు ఆశాజ‌నకంగా ఉండేవ‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. అలాగే అన్న క‌ల్యాణ్‌రామ్ ను కూడా తార‌క్ అభిమానులు స‌పోర్ట్ చేయ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

బాల‌య్య, క‌ల్యాణ్‌రామ్‌కు దూరంగా తారక్ ఫ్యాన్స్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share