అశ్వంతో ఎన్టీఆర్ కుస్తీ..వీడియో హల్ చల్

June 26, 2019 at 4:31 pm

ప‌రుగెత్తుతున్న గుర్రంపై జంప్ చేసి హీరో ప‌రుగులు పెట్టిస్తాడు రీల్ జీవితంలో… ఎంతో వేగంగా ఉరికె గుర్రంను ఒడుపుతో ప‌ట్టి ర‌య్యిన ప‌రుగులు పెట్టించి, రౌడి మూక‌ల వెంట‌ప‌డి ప‌ట్టుకొని గుర్రం మీద నుంచే వాళ్ళంద‌రిని మ‌ట్టిక‌రిపిస్తాడు హీరో… గుర్రం పై స్వారీ చేయ‌డం అంటే అదే లెక్కా అన్న‌ట్లుగా ఉంటుంది సినిమాలో స‌న్నివేశాలు చూస్తే…

కానీ పాపం మ‌న హీరోగారు మాత్రం ఓ అశ్వంను మ‌చ్చిక చేసుకునేందుకు అప‌సోపాలు ప‌డుతుంటే.. గుర్రం మాత్రం ఏమాత్రం త‌గ్గ‌కుండా మ‌న హీరోగారిని ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్ళు తాపిస్తూ చెమ‌ట‌లు పట్టిస్తుంది… ఇంత‌కు ఎవ‌రా హీరో అనుకుంటున్నారా… యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ గుర్రంను మ‌చ్చిక చేసుకోలేక ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నాడు…

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి రూపొందిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌లు క‌లిసి న‌టిస్తున్నారు. ఇద్ద‌రు టాప్ హీరోలు క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రంలో గుర్రం పై స్వారీ చేసే సీన్లు భారీ ఎత్తున ఉన్నాయ‌ట‌. గుర్ర‌పు స్వారీ నేర్చుకునేందుకు ఓ గుర్రాన్ని షూటింగ్ స్పాట్‌లోకి తెచ్చార‌ట‌. అయితే ఈ గుర్రంపై ఎన్టీఆర్ స్వారీ చేయాల్సి ఉంది. అందుకే దీన్ని మచ్చిక చేసుకునే ప‌నిలో ఉన్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఇప్పుడు ఆ గుర్రంను మ‌చ్చిక చేసుకునే క్ర‌మంలో తీసిని వీడియోలు సోష‌ల్ మీడియాలో హాల్ ఛ‌ల్ చేస్తున్నాయి.

అశ్వంతో ఎన్టీఆర్ కుస్తీ..వీడియో హల్ చల్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share