ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ..బాలయ్య నిర్ణయం ఫైనల్ !

December 7, 2018 at 2:49 pm

ఈ మద్య టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాల ఆడియో వేడుకులకు మరో స్టార్ హీరో వెళ్లి ఉత్సాహ పర్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిన్న హీరోల సినిమా ఆడియో వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు వెళ్లి వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇక నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ గతంలో ఒకరంటే ఒకరు పట్టించుకోరని టాక్ వినిపించేంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తో బాలకృష్ణ వియ్యంకుడు అయిన తర్వాత నందమూరి హరికృష్ణ ఫ్యామిలీని పక్కన బెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చేవి.

ఆ మద్య నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అటు చంద్రబాబు ఇటు నందమూరి బాలకృష్ణ బాధలో ఉన్న కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లను ఓదార్చడం..అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. దాంతో బాబాయి, అబ్బాయి కలిసి పోయారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఈ మద్య తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీడిపికి ప్రచారం చేయకుండా ఎన్టీఆర్ దూరం ఉండటంతో మళ్లీ బాబాయి..అబ్బాయి కి మద్య దూరం పెరింగిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. తారక్‌ చెబితే కళ్యాణ్‌రామ్‌ ఖచ్చితంగా ప్రచారానికి వెళ్లేవాడు. దీనినిబట్టే ఇంకా కుటుంబంలోని విబేధాలు పూర్తిగా సద్దుమణగలేదని అర్థమవుతోంది.

ఆ మద్య అరవింద సమేత విజయోత్సవానికి బాలయ్యని పిలిస్తే ఎన్టీఆర్‌ గురించి మాట మాత్రమైనా మాట్లాడకపోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది. త్వరలో ఎన్టీఆర్ బయోపిక ఆడియో వేడుకును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నారు. మరి ఆ ఆడియో వేడుకకు జూ.ఎన్టీఆర్ ని పిలుస్తారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తన తాత పేరు పెట్టుకున్న ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఓ రేంజ్ లో ఉన్నారు..అలాంటి తాత బయోపిక్ కి తాత పేరు పెట్టుకున్న మనవడిని పిలిస్తే ఎంతో గౌరవం ఉంటుందని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి ఎన్టీఆర్‌కి బాలయ్య నుంచి ఆహ్వానం అందుతుందా? లేదా చూడాలి.

ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ..బాలయ్య నిర్ణయం ఫైనల్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share