ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ఎన్టీఆర్ లుక్ లీక్‌…?

May 15, 2019 at 3:47 pm

ఆర్ ఆర్ ఆర్ చిత్ర విశేషాలు తెలియ‌క‌పోవ‌డంతో ఆర్ ఆర్ ఆర్‌లో అస‌లు ఏమీ జ‌రుగుతుందో తెలియ‌క అభిమానులు అల్లాడిపోతున్నారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమానే ఆర్ ఆర్ ఆర్‌. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్ గానే పిలుస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా నిర్మాణం జ‌రుపుకుంటోంది. ఎక్క‌డ షూటింగ్ జ‌రుగుతుందో, ఏ పార్ట్‌ను షూట్ చేస్తున్నారో, ఎవ‌రు షూటింగ్‌లో పాల్గొంటున్నారో ఎవ‌రికి కొంచెం కూడా స‌మాచారం లీక్ కాకుండా అటు చిత్ర హీరోలు, ఇటు ద‌ర్శ‌కుడు, మ‌రోవైపు చిత్ర యూనిట్‌, సాంకేతిక నిపుణులు జాగ‌త్త్ర‌లు తీసుకుంటున్నారు.

ఎంతో ర‌హాస్యంగా చిత్ర నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో ఇప్పుడు ఒక లుక్ లీకైంద‌నే ప్ర‌చారం వైర‌ల్ అయింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ బిజిలోనే ఉన్నారు. రామ్‌చర‌ణ్ మాత్రం షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ లుక్ లీకైంద‌ని లోకం కోడై కూస్తూంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల‌కు ఎంత ప్రాధాన్య‌త ఇస్తారో మ‌రోవైపు బిజినెస్ యాడ్‌ల‌కు అంతే ప్రాధాన్య‌త ఇస్తారు. అయితే ఓవైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్‌కు విరామం ఇచ్చి మ‌రి ఓ బ్రాండ్ కు యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఒట్టోకు జూనియ‌ర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. అయితే ఈ బ్రాండ్‌పై పురుషుల‌కు సంబందించిన దుస్తుల యాడ్‌ను చిత్రించారు. ఒక్కో ప్రేమ్‌కు ఒక్కో డ్రెస్ మార్చుకుంటూ యాడ్ షూటింగ్‌లో పాల్గోన్నాడు. అయితే ఇక్క‌డే ఎన్టీఆర్ లుక్ లీకైంది. అదేంటంటే ఆర్ ఆర్ ఆర్ మూవీలో తాను పోషిస్తున్న పాత్ర గెట‌ప్‌లోనే అత‌డు యాడ్ షూటింగ్‌లో పాల్గోన్నాడు. సో ఎన్టీఆర్ లుక్ ఈ యాడ్‌తో లీకైంది. ఈ వీడియోను ఆర్ ఆర్ ఆర్ అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ చూస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ఎన్టీఆర్ లుక్ లీక్‌…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share