హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ

June 19, 2019 at 11:00 am

చూడ‌గానే ఆక‌ట్టుకునే అందం… ఎత్తు ఒడుపు చూడ‌గానే అతిలోక సుంద‌రి గుర్తుకొస్తుంది… ముట్టుకుంటే మాసిపోయే రంగు… కందిరీగ న‌డుము… ఒంపులు సొంపుల‌తో యువ‌త‌ను క‌ట్టిప‌డేసే రూప‌లావ‌ణ్య సుంద‌రి 35వ వ‌సంతంలోకి అడుగుపెడుతుంది… అయినా త‌న అందం, ఒంపు, సొంపును ఏమాత్రం కోల్పోకుండా గ్లామ‌ర్ క్వీన్‌గా సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌ళ‌క్కున మెరుస్తూనే ఉంది.. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధ‌ల‌ను చేస్తూనే ఉంది.. ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

1985 జూన్ 19న పుట్టిన కాజ‌ల్ అగ‌ర్వాల్ 2007లో తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌క్ష్యీక‌ళ్యాణం సినిమాతో కేరీర్ ప్రారంభించిన కాజ‌ల్ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ సుంద‌రికి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చంద‌మామ సినిమా స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. ఇక అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూడ‌కుండా 12ఏండ్ల కేరీర్‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తూనే ఉంది. ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించి మంచిపేరు తెచ్చుకున్న కాజ‌ల్ చివ‌రికి బాలీవుడ్ బాట‌కూడా తొక్కింది. కాని బాలీవుడ్‌లో అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో టాలీవుడ్‌కు తిరిగొచ్చింది.

ఈ ప‌న్నేండ్ల కేరీర్‌లో కాజ‌ల్ అనేక మంది హీరోల‌తో జోడి క‌ట్టి విజ‌య‌వంతం అయింది. ఆరుప‌దుల వ‌య‌స్సున్న హీరోల‌తోనూ జ‌త‌క‌ట్టి స‌క్సెస్‌లు సాధించింది కాజ‌ల్‌. ఈ ప‌న్నేండ్ల సుధీర్ఘ ప్ర‌యాణంలో కాజ‌ల్ మొత్తం 54 చిత్రాల్లో న‌టించ‌గా ఇందులో టాలీవుడ్‌లో న‌టించిన‌వి 31చిత్రాలు. అదే విధంగా త‌మిళ్‌, హింది చిత్రాల్లోనూ న‌టించిన కాజ‌ల్‌కు విజ‌యాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి రూపొందించిన మ‌గ‌ధీర సినిమాతో ఒక్క‌సారే టాప్ పొజిష‌న్ లోకి వ‌చ్చింది కాజ‌ల్‌. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంలోనూ న‌టించి మెప్పించింది. 35ఏండ్ల వ‌య‌స్సులోనూ కాజ‌ల్ టాలీవుడ్ నంబ‌ర్‌వ‌న్‌గా కొన‌సాగుతుంది. సో పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న కాజ‌ల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుదాం.

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share