కార్తీ ‘ ఖాకి ‘ ఫ‌స్ట్ షో టాక్‌…. సినిమా ఎలా ఉందంటే

త‌మిళ్‌వాడు అయినా తెలుగు ప్ర‌జ‌ల‌కు త‌న సినిమాల‌తో బాగా ద‌గ్గ‌ర అయిన హీరో కార్తీ తాను త‌మిళ్‌లో న‌టించిన సినిమాల‌ను ఇక్క‌డ కూడా రిలీజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త‌న చివ‌రి సినిమా కాష్మోరాతో హిట్ కొట్టిన కార్తీ తాజాగా ఖాకి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కార్తీ స‌ర‌స‌న స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు పీఎస్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే ఫ‌స్ట్ షోలు కంప్లీట్ చేసుకుంది.

ఫ‌స్ట్ షో టాక్ ప్ర‌కారం సినిమాకు యాక్ష‌న్ సినిమాగా టాక్ వ‌చ్చింది. సినిమాలో కార్తీ ఓ దొంగ‌ల ముఠాను వేటాడే ఇన్వెస్ట్‌గేష‌న్ పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టించాడు. హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది. ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రారంభంలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య కొన్ని ల‌వ్‌సీన్లు ఉంటాయి. ఆ త‌ర్వాత అస‌లు క‌థ‌లోకి సినిమా ఎంట‌ర్ అవుతుంది.

డీసెంట్ ఫ‌స్టాఫ్ త‌ర్వాత సెకండాఫ్ మొత్తం హీరో దొంగ‌ల ముఠాను ప‌ట్టుకునేందుకు వేసే ఎత్తులు, ప్లాన్ల‌తో చాలా ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతుంది. హీరో పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌ర్ ఫుల్‌గా చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌మీద ప్ర‌జెంట్ చేసేందుకు గ్రిప్పింగ్‌గా, క్లీయ‌ర్‌గా రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా అదిరిపోయాయి. ఓవ‌రాల్‌గా ఇన్వెస్ట్‌గేష‌న్‌, పోలీస్‌, యాక్ష‌న్ థ్రిల్లింగ్ సినిమాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఖాకి బాగా న‌చ్చుతుంది. మంచి క‌మ‌ర్షియ‌ల్ మూవీగా ఖాకి నిల‌వ‌చ్చు. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుజ‌ర్న‌లిస్టు.కామ్‌