మ‌హేష్ హీరోయిన్ ఫ‌స్ట్ అఫైర్ అతనితోనే

June 15, 2019 at 3:07 pm

కియారా అద్వానీ నార్త్ నుంచి సౌత్ వరకు వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ సినిమా క‌బీర్‌సింగ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పెట్టిన ఈ చిన్నది… ఆ తర్వాత రామ్ చరణ్ పక్కన వినయ విధేయ రామ సినిమాలో కూడా ఆడి పాడింది. అయితే భరత్ అనే నేను సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ కాస్త వినయ విధేయ రామాతో రివర్స్ అయింది. క‌బీర్‌సింగ్‌ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నా ఆమె త‌న తాజా ఇంటర్వ్యూలో తన తొలిప్రేమ గురించి చెప్పుకొచ్చింది.

తాను 10వ తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డాన‌ని చెప్పిన ఆమె… తన తొలిప్రేమ విషయాలను బయట పెట్టి హాట్ టాపిక్ గా మారింది. పదో తరగతిలో తాను మనస్ఫూర్తిగా ఓ అబ్బాయిని ప్రేమించాను అని… అయితే మమ్మీ ఈ వ‌య‌స్సులో ప్రేమ.. దోమ వద్దు ముందు చదువుపై దృష్టి పెట్టమని స‌ల‌హా ఇవ్వడంతో… తను తన తొలి ప్రేమకు అప్పుడే బ్రేక‌ప్ చెప్పేశానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు తనకు ప్రేమించే సమయం లేదని వాపోయింది.

తెలుగులో వినయ విధేయ రామ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఆమెకు ఇక్కడ అవకాశాలు రావడంలేదు. బాలీవుడ్లో మాత్రం ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు క‌బీర్‌సింగ్ విడుదలకు రెడీ అవుతుండ‌గా… మరో రెండు, మూడు హిందీ సినిమాల్లో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న కియారా ఇప్పటికైనా ప్రేమలో పడుతుందేమో చూడాలి.

మ‌హేష్ హీరోయిన్ ఫ‌స్ట్ అఫైర్ అతనితోనే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share