డిప్రెష‌న్‌లోకి క్రిష్‌.. కార‌ణం అదే..!

March 7, 2019 at 11:42 am

ఒకే ఒక్క ఛాన్స్‌.. జీవితాన్ని మార్చేస్తుంది.. ఒక్క విజ‌యం రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెడుతుంది.. ఒక్క డిజాస్ట‌ర్ తీవ్ర డిప్రెష‌న్‌లోని నెడుతుందా.. ? అంటే ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌రిస్థితి చూస్తుంటే మాత్రం ఔన‌నే స‌మాధానం వ‌స్తుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ దెబ్బ‌తో ఆయ‌న విల‌విలాడుతున్నాడు. అన్నిర‌కాలుగా ఆయ‌న ఇప్పుడు న‌ష్ట‌పోయాడు. తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ స‌త్తాచాటుతున్న త‌రుణంలోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపంలో ఆయ‌న ముప్పు ముంచుకొచ్చింది. మ‌ణిక‌ర్ణిక సినిమాను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి మ‌రీ వ‌చ్చిన క్రిష్‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఓదార్పు లేని వేద‌న‌ను మిగిల్చింది.

ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ ఇప్పుడు ఆయ‌న ప‌య‌నం ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ డిజాస్ట‌ర్‌గా మిగిలిపోవ‌డంతో.. బ‌య్య‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోయారు. బాల‌య్య‌కు కూడా మిగిలింది ఏమీలేదు. కాక‌పోతే.. ఈరోజు పోతే.. మ‌రో రోజైనా ఈ న‌ష్టాన్ని అటు బాల‌య్య‌, ఇటు బ‌య్య‌ర్లు పూడ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. కానీ.. ద‌ర్శ‌కుడు క్రిష్ కోలుకోవ‌డానికే కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌ధానంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ ఫెయిల్యూర్‌తో ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ కాకున్నా.. తీవ్ర డిప్రెష‌న్‌లోని నెట్టింద‌న్న‌ది మాత్రం నిజ‌మేన‌ని చెబుతున్నాయి.

మ‌ణిక‌ర్ణిక సినిమాను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి రావ‌డంలో హీరోయిన్ కంగ‌న‌తో తీవ్ర వివాదం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా క్రిష్‌కు క‌ష్ట‌కాల‌మే. ఇదిలా ఉండ‌గా.. క్రిష్ వ్య‌క్తిగ‌త జీవితం కూడా కొంత ఇబ్బందిక‌రంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న వివాహం విష‌యంలోనూ ఆయ‌న మాన‌సికంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డి సినిమాలు తీసేందుకు క్రిష్ చాలాకాలం పాటు సైలెంట్‌గా ఉండాల‌ని.. ఆ త‌ర్వాతే సినిమాల గురించి ఆలోచించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ విష‌యంలో మ‌రింత క్లారిటీ రావాలంటే.. క్రిష్ నోరు విప్పితేనే తెలుస్తుంది మ‌రి.

డిప్రెష‌న్‌లోకి క్రిష్‌.. కార‌ణం అదే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share