వర్మ “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” ఫ‌స్ట్ డే కలెక్షన్స్

March 30, 2019 at 2:45 pm

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన బ‌యోపిక‌ల్ మూవీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపుతోంది. అనేక వివాదాల మ‌ధ్య ఈ సినిమా గురువారం నాడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప‌లువురి నుంచి వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు ఏపీలో విడుద‌ల‌పై అక్క‌డి హైకోర్టు స్టే విధించింది. దీంతో ఏపీ మిన‌హా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను వ‌ర్మ విడుద‌ల చేశాడు. అయితే… విశ్వ‌విఖ్యాత న‌టుడు, తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాలను, ముఖ్యంగా ల‌క్ష్మీపార్వ‌తి ఎదుర్కొన్న అవ‌మానాలు, ఇబ్బందులు, ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు అంశాన్ని వ‌ర్మ ప్ర‌ధానంగా చూపించారు.

ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచే తెలుగు ప్రేక్ష‌కుల్లో తీవ్ర ఆస‌క్తిని రేకెత్తించింది. బాల‌య్య‌బాబు హీరోగా వ‌చ్చిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు పోటీగా వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ రెండు భాగాలు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు వ‌చ్చాయిగానీ.. పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేక‌పోయాయి. బాక్సాఫీస్ వ‌ద్ద కూడా బొక్కాబోర్లాప‌డ్డాయి. ఇదే స‌మ‌యంలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పాట‌లు, ట్రైల‌ర్ల‌తో వ‌ర్మ హైప్ క్రియేట్ చేశారు. తాను చెప్పిందే చూపిస్తాన‌ని, అన్న‌గారి జీవితాన్ని ఆవిష్క‌రిస్తాన‌ని వ‌ర్మ చెబుతూ వ‌చ్చాడు. సినిమా విడుద‌ల కావ‌డంతో చెప్పిందే చేశాడ‌నే టాక్‌వినిపిస్తోంది.

అయితే.. ఏపీలో మిన‌హా తెలంగాణ‌తోపాటు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల అయిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మొద‌టి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల క్యూ క‌ట్టారు. మొత్తంగా మొద‌టి రోజు ఈ సినిమా సుమారు రూ.4కోట్లు వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం. చాలా ఏళ్ల త‌ర్వాత వ‌ర్మ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వ‌సూళ్లుగా నిలిచాయ‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. యూఎస్‌లో ఈ సినిమాను 125 స్ర్కీన్ల‌లో విడుదల చేశారు. అక్క‌డ కూడా వ‌సూళ్లు బాగానే ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ముందుముందు వ‌సూళ్లు పెరుగుతాయ‌నే ట్రేడ్‌వ‌ర్గాలు అంటున్నాయి.

వర్మ “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” ఫ‌స్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share