‘ మ‌హ‌ర్షి ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… రికార్డులు బ్రేక్‌

May 10, 2019 at 12:23 pm

ప్రిన్స్ మహేష్ బాబు – పూజా హగ్దే , అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సినిమా గురువారం రిలీజ్ అయ్యింది. సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నా మిక్స్‌డ్ టాక్‌తో మ‌హ‌ర్షి థియేట్రిక‌ల్ ర‌న్ స్టార్ట్ అయ్యింది. మహేష్ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఓవ‌ర్సీస్‌లో ఏకంగా 2500 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు. ఓ తెలుగు సినిమాకు ఇది రెండో హ‌య్య‌స్ట్ ఓవ‌ర్సీస్ రిలీజ్‌.

ఇక ఇటు ఏపీ, తెలంగాణ‌లోనూ మ‌హేష్‌కు థియేట‌ర్స్ ప‌రంగా టాప్ రిలీజ్‌. ఇక తెలంగాణ లో ఐదు షోలు వేయడం… టిక్కెట్ల రేట్ల పెంపుతో మహర్షి మొదటి రోజు భారీ కలెక్షన్లు నమోదు చేసింది. నైజాంలో అయితే ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయడం విశేషం. నైజాంలో తొలి రోజు మ‌హ‌ర్షి రూ 6.38 కోట్లు రాబ‌ట్టి బాహుబ‌లి 1 ( రూ 6.289 కోట్లు)ను బీట్ చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక బాహుబ‌లి 2 రూ 8.92 కోట్ల‌తో తొలి స్థానంలో ఉంది.

ఇక మ‌హ‌ర్షి తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్ట‌గా… తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూస్తే రూ 33.5 కోట్ల గ్రాస్ రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా, గుంటూరులో నాన్ బాహుబ‌లి తొలి రోజు రికార్డులు బీట్ చేసేసింది. ఇవి మ‌హేష్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌గా ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. భరత్ అనే నేను తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ.55 కోట్ల గ్రాస్ రాబడితే ఆ రికార్డును మహర్షి బ్రేక్ చేసింది.

‘ మ‌హ‌ర్షి ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… రికార్డులు బ్రేక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share