స్టైలిష్ లుక్‌లో మహేష్ “మహర్షి “టీజర్

April 7, 2019 at 10:26 am

అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’ టీజర్‌ శనివారం విడుదలైంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో మరింత స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో ‘ప్రిన్స్‌’ చెప్పిన డైలాగులు మరింత పదునుగా ఉన్నాయి. అభిమానులను కట్టిపడేసేలా ఉన్నాయి. ‘సక్సెస్‌కు ఫుల్‌స్టాప్స్‌ ఉండవు కామాలు మాత్రమే ఉంటాయ్‌.. ఎవడైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు’ అంటూ రిషి పాత్రలో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఉగాది పండుగకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇందులో స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా మహేశ్‌బాబు కనిపిస్తారు. మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

స్టైలిష్ లుక్‌లో మహేష్ “మహర్షి “టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share