1000 మంది చిన్నారుల‌ను కాపాడిన మహేష్

June 18, 2019 at 2:08 pm

శ్రీ‌మంతుడు సినిమాలో హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న సొంతూరును ద‌త్త‌త తీసుకుంటాడు… ద‌త్త‌త తీసుక‌న్న ఊరులో ఎవ్వ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా వెంట‌నే ఆదుకుంటాడు. రైతులకు రుణాల ఇచ్చేందుకు బ్యాంక్‌ను ఏర్పాటు చేయిస్తాడు. సాగునీరు అందించి రైతుల స‌మ‌స్య‌ల‌ను తీర్చుతాడు. విద్యార్థుల‌కు బ‌డిక‌ట్టిస్తాడు. తాగేందుకు ట్యాంక్‌ను నిర్మిస్తాడు. ఊరుకు రోడ్డు, అన్యాక్రాంత‌మైన చెరువును బాగుచేయ‌డంతో పాటుగా గ్రామంలో అసాంఘిక ప‌నుల‌ను అడ్డుకుని గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిద‌ద్దుతాడు హీరో మ‌హేష్‌బాబు. శ్రీ‌మంతుడు సినిమాలో ఇది చూపించిన క‌థ‌.

శ్రీ‌మంతుడు సినిమా చేసిన స్ఫూర్తితో నిజ‌జీవితంలోనూ ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న పుట్టిన ఊరు బుర్రిపాలేంను ద‌త్త‌త తీసుకున్నాడు. బుర్రిపాలేం బుల్లోడైన మ‌హేష్‌బాబు ద‌త్త‌త తీసుకున్న త‌న ఊరును అభివృద్ధి ప‌రిచారు. గ్రామంలో నెల‌కొన్న ధీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి నిజ‌మైన శ్రీ‌మంతుడు అయ్యాడు మ‌హేష్‌బాబు. అదే స్ఫూర్తిని కొన‌సాగిస్తూ మ‌హేష్‌బాబు మ‌రో ఉదాత్త‌మైన సేవ‌కు పూనుకున్నాడు.

ఓ సందేశాత్మ‌క పాయింట్‌ను తీసుకుని సినిమాల‌ల్లో న‌టిస్తున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు కేవ‌లం సినిమా పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా దానిని నిజ‌జీవితంలోనూ పాటిస్తూ ప‌లువురు సిని పెద్ద‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. మ‌హేష్‌బాబు దాదాపుగా మూడేళ్ళుగా సుమారు 1000మంది చిన్నారుల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయించాడ‌ట‌. చిన్నారి పిల్ల‌ల‌కు ప‌ట్టుకుంటున్న మ‌హ‌మ్మారీ గుండె జ‌బ్బులు. ఈ గుండె జ‌బ్బుల‌తో ఎంద‌రో చిన్నారుల జీవితాలు ప‌సిమొగ్గ‌లుగానే రాలిపోతున్నారు. అలాంటి ప‌సిమొగ్గ‌లు వాడిపోకుండా ఆంధ్ర హ‌స్పిట‌ల్‌, ఇంగ్లాండ్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేష‌న్ సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్లు చేయించార‌ట మ‌హేష్‌బాబు. ఈ విష‌యాన్ని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌క‌టించింది. సో ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోనే.

1000 మంది చిన్నారుల‌ను కాపాడిన మహేష్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share