ప్రిన్స్‌కు మ‌రో అరుదైన ఘ‌న‌త‌…

May 17, 2019 at 6:04 pm

టైమ్స్ మ్యాగజైన్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా “మోస్ట్ డిసైరబుల్ మెన్” లిస్ట్ ని విడుదల చేసింది. సౌత్ నుంచి ఈ లిస్ట్‌లో పేరు సంపాదించిన ఏకైక మొద‌టి వ్య‌క్తి మ‌హేష్ బాబు. అయితే ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ,వెనక్కి నెట్టేసి మన సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిస్థానాన్ని దక్కించుకున్నాడు. మ‌హేష్ బాబు వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌ను రారాజుగా ఏలుతున్నాడు. మ‌హేష్‌బాబు వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది మ‌రింత అందాన్ని పెంచుకుంటూ త‌న వ‌య‌స్సును త‌గ్గించ‌కుంటున్నాడు. మ‌హ‌ర్షి సినిమాలో హండ్స‌మ్ లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధ‌ల‌ను చేశాడు.

టైమ్ మ్యాగ‌జైన్ ప్ర‌తి ఏడాది 50మంది పేర్ల‌తో లిస్టు త‌యారు చేసింది. సినిమాల ప‌రంగా వరుస విజ‌యాలు సాధిస్తున్న టాలీవుడ్‌లో టాప్‌హీరో. కేవ‌లం 50మందిలో నుంచి మ‌హేష్ బాబును నంబ‌ర్‌వ‌న్‌గా ఎంచుకున్నార‌ట‌. సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ వంటి నార్త్ హీరోలు మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్” కాంపిటీషన్ లో నిత్యం పోటీ పడుతుంటారు. అయితే మహేష్ బాబూ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో పాటు జనాలను కట్టుకునే విధంగా నడుచుకోవడంలో బలశాలి. ఈ క్రెడిట్ అందుకున్న మొట్టమొదటి సౌత్ హీరో మహేష్ కావడం విశేషం.

అందుకే ఈ సారి మహేష్ మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్ అనే కీర్తిని అందుకున్నాడు. మహర్షి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ ఇచ్చిన మరో గుర్తింపుకు మరింత హ్యాపీగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా 8రోజుల్లోనే 150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను అందుకోగా, 80కోట్ల‌కు పైగా డిస్ట్రిబ్యూట‌ర్ షేర్‌ను సాధించింది. ఓవైపు మ‌హ‌ర్షి ఇచ్చిన విజ‌యం, ఇప్పుడు టైమ్ మ్యాగ‌జైన్ ఇచ్చిన అవార్డుతో మ‌హేష్ బాబు అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయింది. విజ‌య‌వాడ‌లో శుక్రవారం సినిమా విజయోత్సవాన్ని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించనున్నారు. ప‌నిలో ప‌నిగా అవార్డు విజ‌యాన్ని ఆస్వాదించ‌నున్నారు.

ప్రిన్స్‌కు మ‌రో అరుదైన ఘ‌న‌త‌…
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share