మహేష్ కు హాలీవుడ్ నటుడు భారీ ఆఫర్

April 29, 2019 at 11:38 am

ఎక్స్‌మెన్ : ది లాస్ట్ స్టాండ్‌, కమాండో, ప్రిడేట‌ర్ వంటి సినిమాల‌తో పాపుల‌ర్ అయిన హాలీవుడ్ న‌టుడు బిల్ డ్యూక్ టాలీవుడ్ న‌టుడు ప్రిన్స్ మ‌హేశ్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. మ‌హేశ్‌తో స్పై మూవీ చేయాల‌ని ఉంద‌ని, త‌ను మ‌హేశ్‌తో క‌లిసి న‌టించాల‌ని త‌న మ‌నసులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. త‌న‌కు న‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులైన మ‌హేశ్‌, వంశీ పైడిప‌ల్లి, త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ ల‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌ని ఉంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అన్నీ కుదిరితే అంత‌ర్జాతీయ స్థాయి స్పై సినిమా తీద్దామ‌ని ఆయ‌న వారిని లంచ్‌కు ఆహ్వానించారు.

వంశీ పైడిప‌ల్లి, మ‌హేశ్‌బాబు ఏదైనా ప‌ని మీద లాస్ ఏంజెల్స్‌కు వ‌చ్చిన‌ప్పుడు డౌన్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లో దిగి, త‌న ఇంటికి భోజ‌నానికి రావాల‌ని ఆయ‌న స్వాగ‌తం పలికారు. అదే స‌మ‌యంలో ఇంట‌ర్నేష‌న్ సినిమా గురించి ఆలోచిద్దామ‌ని బిల్ ట్వీట్ చేశారు. మ‌రో ట్వీట్‌లో త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్‌తో పాటు మ‌హేశ్‌బాబును డ్యూక్ భోజ‌నానికి ఆహ్వానించారు. కుదిరితే మ‌రో ప్రాజెక్ట్ చేయ‌డానికి త‌న ఉత్సాహాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ట‌ర్ వేదిక గా పంచుకున్నారు.

ఇక మ‌రో సంద‌ర్భంలో మ‌హిళ‌ల అక్ష‌రాస్య‌త గురించి, వారి అభివ్రుద్ధికి పాటుప‌డుతున్న ఐశ్వ‌ర్య ధ‌నుష్‌ను కూడా స్వాగ‌తించారు. 2016లో ఐశ్వ‌ర్య యునైటెడ్ నేష‌న్స్ ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి వారి ఉన్న‌తికోసం ఆమె తీవ్రంగా శ్ర‌మిస్తున్న విష‌యం తెలిసిందే. దానిని పుర‌స్క‌రించుకుని మ‌హిళ‌ల అభివ్రుద్ధి గురించి ఆలోచిద్దామ‌ని ఐశ్వ‌ర్య‌ను ఆహ్వానించారు. కాగా, ఓ హాలీవుడ్ న‌ట‌దిగ్గ‌జం నుంచి ఆహ్వానం రావ‌డంతో మ‌హేశ్ అభిమానులు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు.

మహేష్ కు హాలీవుడ్ నటుడు భారీ ఆఫర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share