మహేష్ పై సూపర్ స్టార్ కామెంట్స్

May 10, 2019 at 3:48 pm

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు… తండ్రి న‌ట‌శేఖ‌రుడిగా, సూప‌ర్‌స్టార్‌గా నాలుగున్న‌ర ద‌శాబ్ధాలు వెండితెరను ఏలిన కృష్ణ త‌న కొడుకు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాను చూసి మురిసి పోతున్నాడు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం క‌లిగేది… ఆ పుత్రుడు ప్ర‌యోజ‌కుడైన త‌రువాతే అన్న‌ట్లు మ‌హేష్‌ను చూసి సూప‌ర్ స్టార్ కృష్ణ మురిసిపోతున్నాడు. త‌న కొడుకు త‌న‌క‌న్నా సూప‌ర్‌స్టార్ అయిపోతున్నాడ‌ని కృష్ణ సంతోష ప‌డుతున్నాడు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఇద్ద‌రు భార్య‌లు, ముగ్గురు కొడుకులు. అందులో న‌రేష్‌, ర‌మేష్‌బాబు, ప్రిన్స్ మ‌హేష్‌బాబు. న‌రేష్ హీరోగా అనేక చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. న‌రేష్ ఇప్పుడు సెండ‌క్ ఇన్నింగ్స్ ప్రారంభించి తండ్రి, అన్న‌, మామ పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఇక ర‌మేష్‌బాబు కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించి ఇప్పుడు నిర్మాత‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇక ప్రిన్స్ మ‌హేష్‌బాబు బాల న‌టుడిగా సిని రంగ ప్ర‌వేశం చేసి ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర‌హీరోలో ఒక‌డిగా నిలిచాడు.

తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో క‌లిసి మ‌హేష్‌బాబు కొడుకు దిద్దిన కాపురంతో పాటు అనేక చిత్రాల్లో న‌టించి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబు త‌న తండ్రిని మించిన న‌ట‌న‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న కొడుకు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాను త‌న భార్య విజ‌య‌నిర్మ‌ల‌తో క‌లిసి వీక్షించిన అనంత‌రం మ‌హ‌ర్షి సినిమాపై, త‌న కొడుకుపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపిస్తున్నాడు. ఏ తండ్రైనా కోరుకునేది త‌న పుత్రులు త‌న‌క‌న్నా గొప్ప స్థానాల్లో ఉండాల‌ని. ఏ కొడుకైనా కోరుకునేది త‌న త‌ల్లిదండ్రులు త‌న విజ‌యాల‌ను చూసి పొంగిపోవాల‌ని. సో ఇరువురు అశించిన‌ట్లే కొడుకు విజ‌యాల‌కు తండ్రి ఆనందం పొందుతున్నాడు.

మహేష్ పై సూపర్ స్టార్ కామెంట్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share