తెలుగు రాష్ట్రాల్లో ‘ మ‌హ‌ర్షి ‘ జోరు… బాహుబ‌లికే చెక్‌

May 10, 2019 at 12:08 pm

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేస‌వి సెల‌వులు, సోలో రిలీజ్‌, మార్కెట్‌లో పోటీ సినిమాలు లేక‌పోవ‌డం, ఇటు భ‌ర‌త్ త‌ర్వాత యేడాది గ్యాప్ తీసుకుని మ‌హేష్ మ‌హ‌ర్షితో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌హ‌ర్షి కొన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. నైజామ్, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో తొలిరోజున ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.

నైజామ్ లో ఈ సినిమా రూ 6.38 కోట్లను రాబట్టి బాహుబలి 1 రికార్డుకు చెద‌లు ప‌ట్టించింది. ఇక ఇక్క‌డ బాహుబ‌లి 2 త‌ర్వాత రికార్డు మ‌హ‌ర్షి పేరు మీదే ఉంది. కృష్ణా ఏరియాలో రూ 1.39 కోట్ల షేర్ వసూలు చేసి భరత్ అనే నేను వసూళ్లను క్రాస్ చేసింది. ఇక గుంటూరు ఏరియాలో రూ 4.40 కోట్ల వసూళ్లను రాబట్టి వినయ విధేయ రామ వసూళ్లను అధిగమించింది. ఇక మిగిలిన ఏరియాల వ‌సూళ్ల వివ‌రాలు రావాల్సి ఉంది.

మిక్స్‌డ్ టాక్‌తోనే తొలి రోజు వ‌సూళ్ల‌లో ప్ర‌భంజంన సృష్టించిన మ‌హ‌ర్షి రెండో రోజు నుంచి ఏ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌డుతుంద‌న్న అంశంపైనే ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంద‌న్న‌ది ఆధార‌ప‌డి ఉంది. ఇక ఓవ‌రాల్‌గా మ‌హ‌ర్షి రూ.140 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు చెపుతున్నారు. క‌నీసం రెండు వారాల పాటు థియేట‌ర్ల‌లో స్టడీగా ర‌న్ అయితేనే మ‌హ‌ర్షి బ‌య్య‌ర్లు భ‌య‌ట‌ప‌డ‌తారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘ మ‌హ‌ర్షి ‘ జోరు… బాహుబ‌లికే చెక్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share