మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌… నాగార్జున ఇంకా వ‌ర్జినే

June 13, 2019 at 1:54 pm

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్ గురువారం రిలీజ్ అయ్యింది. నాగార్జున కెరీర్‌లో మంచి క్లాసిక్ మూవీగా తెర‌కెక్కిన మ‌న్మ‌థుడికి కొన‌సాగింపుగా 17 ఏళ్ల త‌ర్వాత మ‌న్మ‌థుడు 2 రావ‌డం విశేషం. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌లో ఆద్యంత కామెడీగానే ఉంది. నాగ్‌కు ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా పెళ్లి కాక‌పోవ‌డంతో మ‌నోడిని అంద‌రూ ఆట‌ప‌ట్టిస్తుంటారు. టీజ‌ర్ మొత్తం నాగ్‌ను అంద‌రూ టీజ్ చేయ‌డ‌మే కనిపించింది.

ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చుట్టూ ఈ కథను అల్లి చాలా కామెడీగా చూపించారు. పిల్ల‌ల‌కు కోచింగ్ ఇవ్వాల్సిన వ‌య‌స్సులో నాగార్జున బ్యాటింగ్‌కు దిగుతున్నావేంట్రా అని నాగ్‌కు రావూ ర‌మేష్ పంచ్ ప‌డిపోతుంది. ఇక నాగ్ మన్మథుడుగా ఒరిజినల్ అవతారంలోకి వచ్చేసి అమ్మాయిలతో రొమాన్స్ పండిస్తూ ముద్దులతో ముంచెత్తుతున్నాడు. 

నాగ్ వ‌య‌స్సు 60కు చేరువు అవుతున్నా మ‌నోడు మాత్రం జ‌స్ట్ 30 క్రాస్ అయిన వాడిలా న‌వ మ‌న్మ‌థుడిగా మ‌నోడిని చూపించారు. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఏదేమైనా న‌వ‌మ‌న్మ‌థుడిగా నాగార్జున మ‌న్మ‌థుడు 2తో మ‌రో క్లాసిక్ హిట్ కొడ‌తాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌… నాగార్జున ఇంకా వ‌ర్జినే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share