మహర్షిపై మురుగదాస్ కామెంట్స్ ..

May 9, 2019 at 4:05 pm

ప్రిన్స్ మహేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ఓవైపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ నిలుస్తుండ‌టంతో ప‌లువురు మ‌హేష్ బాబుకు ప్ర‌సంశ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హ‌ర్షి సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 2వేల దియోట‌ర్ల‌లో గురువారం విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది. మ‌హ‌ర్షి సినిమా విజ‌య‌వంతం అయి ప్రిన్స్ కు సూప‌ర్ హిట్ ద‌క్కాలంటూ కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు.

మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు స్పైడ‌ర్ మూవీలో న‌టించాడు. స్పైడ‌ర్ సినిమా మ‌హేష్‌బాబు కేరిర్‌లో అనుకున్నంత విజ‌య‌వంతం కాలేదు. దీంతో మ‌హేష్ బాబు అభిమానుల‌కు మురుగ‌దాస్‌ను నానా మాట‌ల‌న్నారు. మ‌హేష్‌బాబు సైతం మురుగదాస్‌ను స్పైడ‌ర్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలోనే నెగిటివ్‌గా కామెంట్ చేశాడ‌ని అప్ప‌ట్లో వైర‌ల్ అయింది. దీంతో మురుగ‌దాస్‌కు, మ‌హేష్‌బాబుకు మ‌ధ్య సంబంధాలు బెడిసికొట్టాయిని సిని వర్గాల్లో టాక్ న‌డిచింది.

మ‌హ‌ర్షి సినిమా విడుద‌ల కావ‌డం, మురుగ‌దాస్ ట్విట్‌తో మ‌హేష్‌బాబు ను పొగుడుతూ ట్విట్ చేయ‌డంతో మ‌హేష్‌బాబు అభిమానుల్లో సంతోషం వెల్లువెత్తుతుంది. మురుగ‌దాస్ తాను చేసిన ట్విట్‌లో మ‌హేష్‌బాబుది స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సు ఉన్న‌వాడ‌ని, క‌ష్ట‌ప‌డే న‌టుడ‌ని పొగుడుతూ రాసాడు. మ‌హ‌ర్షి సినిమా సూప‌ర్ హిట్ కావాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుతున్న‌ట్లు ట్విట్ట‌ర్లో మెజెస్ చేశాడు. ఏదేమైనా మురుగ‌దాస్ లాంటి ద‌ర్శ‌కులు మ‌హ‌ర్షిపై ప్ర‌సంశ‌లు కురిపించ‌డం అభిమానుల‌కు ఎక్క‌డ‌లేని ఆనందాన్ని క‌లిగిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

మహర్షిపై మురుగదాస్ కామెంట్స్ ..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share