ఆ హీరోయిన్‌కు మెగా హీరో నో… నంద‌మూరి హీరో ఎస్‌

June 11, 2019 at 10:58 am

మెహ‌రీన్ కౌర్ టాలీవుడ్‌లో ఒక‌టీ అరా హిట్లు కొట్టినా వ‌రుస ప్లాపుల‌తో ఈ అమ్మ‌డుకి ఐరెన్‌లెగ్ హీరోయిన్ అన్న ముద్ర‌ప‌డిపోయింది. ఈ సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 సినిమాతో ఆమె ఎట్ట‌కేల‌కు హిట్ కొట్టింది. ఎఫ్ 2తో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకున్న మెహరీన్ చాలా సెలక్టివ్ గా సినిమాలు ఓకె చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తెలుగులో రెండు సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయి. ఒక సినిమా విష‌యంలో హీరో పెండింగ్ పెట్ట‌డంతో ఆ ఛాన్స్ డైల‌మాలో ఉంది. ఇక రెండో సినిమాగా నంద‌మూరి హీరో ప‌క్క‌న రొమాన్స్‌కు రెడీ అవుతోంది.

చిత్ర‌ల‌హ‌రి స‌క్సెస్ త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేన‌ళ్లుడు సాయితేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. గీతా, మూవీ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ‌రీన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని మారుతి ఫిక్స్ అయ్యాడ‌ట‌. సాయి మాత్రం ఆమెను త‌ప్ప ఎవ‌రిని హీరోయిన్‌గా పెట్టినా ఓకే అని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌వాన్ సినిమా టైంలో వీరి మ‌ధ్య కాస్త మిస్ అండ‌ర్‌స్టాండింగ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇక అలా మెగా హీరో సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్న ఆమె ఇప్పుడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌తో ఛాన్స్ కొట్టేసింది. 118 సక్సెస్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమాలో ఆమె న‌టిస్తోంది. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ సతీష్ వేగెశ్న ఈ సినిమా డైరెక్ట‌ర్‌. ఈ సినిమాలో మెహ‌రీన్‌కు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ను ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఆ హీరోయిన్‌కు మెగా హీరో నో… నంద‌మూరి హీరో ఎస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share