ఆ ఇద్ద‌రికి మోక్ష‌జ్ఞ టెన్ష‌న్‌

June 11, 2019 at 12:43 pm

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏకైక వారసుడుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఆరంగ్రేటం ఇప్పట్లో తేలేలా కనబడటం లేదు. మోక్షజ్ఞ రెండేళ్ల క్రితం నుంచి సినిమాల్లోకి వస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ పులోమావి పాత్ర చేస్తాడని అందరూ అనుకున్నారు. ఆ వార్తలు నిజం కాలేదు. శాతకర్ణి తర్వాత బాలయ్య నాలుగు సినిమాలు చేసాడు. అయిన మోక్షజ్ఞ వెండితెరంగ్రేటం జరగలేదు. ఓ పక్క బాలయ్య హిందూపురం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తన 105వ సినిమాకు రెడీ అవుతున్నాడు.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌. రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య కొత్త ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. బాలయ్య ఇంకా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నా మోక్షజ్ఞ సినిమాపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అన్న టెన్షన్ ఆయన అభిమానుల్లో ఉంది. మరోవైపు బాలయ్యతో పాటు సీనియర్ హీరోలుగా ఉన్న చిరంజీవి, నాగార్జున వారసులు సినిమాల్లోకి వచ్చేశారు. వీళ్లు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తమ అభిమాన హీరో కూడా సినిమాల్లోకి వస్తే తమ ఆనందానికి అవధులు ఉండవు అని వారు భావిస్తున్నారు.

మోక్షజ్ఞతో మొదటి సినిమా తీసేది నేనేనని గతంలో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ప్రకటించేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమా తన బ్యానర్‌లో తీసేందుకు సాయి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఇదిలా ఉంటే ఇటీవల లీక్ అయిన మోక్షజ్ఞ లుక్స్ కూడా కాస్త ఆందోళన కలిగించేలా ఉన్నాయి అన్న టాక్ నడిచింది. మ‌రో టాక్ ప్ర‌కారం మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ కోసం ఎన్ని క‌థ‌లు విన్నా అవి అటు త‌న‌యుడితో పాటు, బాల‌య్య‌కు కూడా పెద్ద‌గా న‌చ్చ‌లేద‌ట‌. ఏదేమైనా మోక్షు సినిమా కోసం ఇటు బాల‌య్య ఫ్యాన్స్ ఎంత టెన్ష‌న్‌తో వెయిటింగ్‌లో ఉన్నారో ? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుందా ? అని ఆయ‌న కూడా అంతే టెన్ష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆ ఇద్ద‌రికి మోక్ష‌జ్ఞ టెన్ష‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share