నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ సర్ ప్రైజ్

December 8, 2018 at 10:56 am

తెలుగు చలన చిత్ర సీమలో మకుటం లేని మహరాజుగా వెలుగు వెలిగిపోయిన మహానటులు ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పటికే 103 సినిమాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటి, అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమాలో మహామహనటులు, నటీమణులు ఎంట్రీ ఇచ్చారు. భారీ తారణంతో రూపొందుతున్న ఈ సినిమాలో మారో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారట. నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని గత మూడు సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నారు..కానీ సరైన సమయం, కథ లేనిదే ఇంట్రడ్యూస్ చేయబోనని బాలకృష్ణ అన్నారు.

ఇప్పుడు క్రిష్ కోరిక మేరకు ‘ఎన్టీఆర్’బయోపిక్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశంలో మోక్షజ్ఞ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ రెండు వారలు తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది. కాగా రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుంది..డిసెంబర్ చివరి వారం వరకు పూర్తి చేసి ప్రొడక్షన్ పనులు చూసుకోబోతున్నారట.

నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ సర్ ప్రైజ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share