డేరింగ్ నిర్ణయంతో నానికి డ‌బుల్ ధ‌మాకా..

April 23, 2019 at 1:00 pm

నాని త్యాగం ఊరికే పోలేదు.. మంచి క‌థ‌… క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్న‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన జెర్సీ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతోంది. అంత‌కు మించి నానికి మంచి పేరు ద‌క్కించుకుంటున్నారు. చిత్ర వ‌ర్గాల నుంచే కాదు..ఇడ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి కూడా ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మంచి న‌టుడిగానే కాదు.. మంచి చిత్రం తెరకెక్క‌డానికి తెర‌వెనుక కూడా నాని నిర్మాత‌ల‌కు స‌హ‌క‌రించ‌డ‌మే ఆయ‌న‌లోని గొప్ప‌తనం. నాని మార్కెట్ వ్యాలు ప్ర‌స్తుతం రూ.8కోట్ల వ‌ర‌కు ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ముట్ట‌జెప్పి కొత్త ప్ర‌యోగంగా సినిమా తీయ‌డానికి నిర్మాత‌లు వెనుకా ముందు ఆడార‌ట‌.

అయితే నానియే చొర‌వ చూపి ఈ సినిమాకు నాకు రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు… లాభాలు వ‌స్తే మాత్రం వాటా ఇవ్వ‌డంటూ నిర్మాత‌లకు చెప్ప‌డంతో వారు సంతోషంగా ఒప్పుకున్నార‌ట‌. ఇప్పుడు సినిమా స‌క్సెస్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఇంకో రెండు వారాల వ‌ర‌కైతే సినిమాకు ఢోకా లేదు. ఇప్ప‌టికే రూ.26కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు తెలుస్తోంది. శాటిలైట్ హ‌క్కుల ద్వారా మ‌రో 10కోట్లు స‌మ‌కూర‌గా మొత్తంగా 36 కోట్లు సంపాదించింది. ఇందులో స‌గం ఖ‌ర్చుకు తీసేసిన 18 కోట్ల లాభం అన్న‌మాట‌. అందులో మూడో వంతు నానికి చేరినా 6 కోట్లు పారితోషికం ద‌క్కిన‌ట్టేన‌న్న మాట‌. అంటే.. త‌న టార్గెట్ రీచ్ అయిన‌ట్టే అనుకోవాలి.

పైగా `రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా చేశాడు` అన్న మంచి పేరు కూడా మూట‌గ‌ట్టుకున్నాడు. ఇంకా సినిమాకు లాంగ్ ర‌న్ ఉంద‌న్న‌టాక్ వినిపిస్తుండ‌టంతో ఇంకో 10కోట్ల వ‌ర‌కు ర‌ద్దీ లేద‌ని చిత్ర‌వ‌ర్గాలు ఆనందంలో ఉండ‌టం విశేషం. నాని మొండిధైర్యం, ముంద‌స్తు ఆలోచ‌న‌, కాస్త ప‌ట్టువిడుపు ధోర‌ణి అన్నీ క‌ల‌సి ఆయ‌న‌కు జెర్సీ రూపంలో డ‌బ్బుకు డ‌బ్బు..పేరుకు పేరు ద‌క్క‌డం విశేషం. క‌థ బాగుంటే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొద్దిగా చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి బాస్ అంటూ నాని మిగ‌తా హీరోల‌కు మంచి మెసేజ్ ఇచ్చార‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు.

డేరింగ్ నిర్ణయంతో నానికి డ‌బుల్ ధ‌మాకా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share