ఆ టాలీవుడ్ హీరో కేరీర్ ముగిసిన‌ట్టేనా…!

June 26, 2019 at 4:11 pm

నారా కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ హీరో కేరీర్ ముగిసిన‌ట్లేనా.. అనే అనుమానాలు టాలీవుడ్‌లో ముసురుకుంటున్నాయి. నారా కుటుంబం రాజ‌కీయ కుటుంబం. ఈ కుటుంబం రాజ‌కీయాల్లో ఆరితేరిన కుటుంబం. నారా కుటుంబం అంటే రాజ‌కీయ కుటుంబంగానే అంద‌రికి తెలుసు. కాని అదే నారా వార‌సుల్లో ఒక‌రు సిని రంగ ప్ర‌వేశం చేశారు. అరంగ్రేటంలో మంచి హిట్ సినిమాల్లో న‌టించిన ఈ హీరోకు వ‌రుస ప్లాప్‌లు రావ‌డంతో తెర‌మ‌రుగ‌యిన‌ట్లేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంత‌కు నారా కుటుంబంలోని హీరో ఎవ‌రు… అదేనండి నారా రోహిత్‌. బాణం, సోలో, ప్ర‌తినిధి, అసుర సినిమాల‌తో పాటు ప‌లు చిత్రాల్లో న‌టించిన రోహిత్ కేరీర్ ముగిసిన అధ్యాయంగానే మారిందా అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న అభిమానులు. మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడి కొడుకు నారా రోహిత్‌. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ మంచి అభిరుచి క‌లిగిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగాడు. ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటూ కేరీర్‌ను సాగించిన రోహిత్ ఒక్క‌సారే ఫ్లాపులు రావ‌డంతో ఆయ‌న కేరీర్ ప్ర‌మాదంలో ప‌డింది.

ప్ర‌స్తుతం ఏ సినిమాలు లేక‌పోవ‌డంతో నారా రోహిత్ ఖాళీగానే ఉంటున్నాడ‌ని ఫిలింవ‌ర్గాల టాక్‌. అన‌గ‌న‌గా ద‌క్షిణాది, శ‌బ్దం అనే సినిమాలు అనుకున్న‌ప్ప‌టికి ఆ ప్రాజెక్టులు ముందుకు సాగ‌డం లేదు. దీంతో రోహిత్ చేతిలో సినిమాలు లేక‌పోవ‌డంతో ఆయ‌న ప్ర‌స్తుతం గోర్లు గిల్లుకుంటూ కూర్చున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సో నారా వారి వార‌సుడు ఇక తెర‌మ‌రుగైన‌ట్లేనా అనేది కాల‌మే స‌మాధానం చెప్పాలి.

ఆ టాలీవుడ్ హీరో కేరీర్ ముగిసిన‌ట్టేనా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share