సూర్య “ఎన్జీకే” రికార్డు స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్

May 27, 2019 at 3:27 pm

సూర్య హీరోగా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం ఎన్‌.జి.కె. ఎన్‌.జి.కె. అంటే నంద గోపాల కృష్ణ‌. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 31న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్స్ స‌న్న‌హాలు చేస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను ఇంత‌కుముందే విడుద‌ల చేయ‌గా వాటికి మంచి స్పంద‌న వ‌స్తుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో సూర్య‌పై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఒక మామూలు వ్య‌క్తి ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా మారాలంటే ఎదురైతే ఇబ్బందుల‌ను ఎలా ఎదుర్కోన్నాడు అనే లైన్ తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ద‌ర్శ‌కుడు ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించార‌నేందుకు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌పై అంచ‌నాలే నిద‌ర్శ‌నం. అందుకే ఈ సినిమా కు ఫ్రీరిలీజ్ బిజినేస్ కూడా భారీగానే జ‌రిగింది.

సూర్య‌కు త‌మిళ మార్కెట్‌తో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉంది. అయితే ఇటీవ‌ల ఆయ‌న‌కు సంబందించిన సినిమాలు అనుకున్న మేర‌కు బిజినెస్ కాక‌పోవ‌డంతో ఈ సినిమాపై ప్ర‌భావం ప‌డుతున్న అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికి ఫ్రీరిలీజ్ బిజినేస్ మాత్రం బాగానే జ‌రిగింది. త‌మిళంలో రూ.50కోట్ల బిజినెస్ అయింది. తెలుగులో రూ.9కోట్లుతో కె.కె. రాధామోహ‌న్ హ‌క్కులు తీసుకున్నారు. శాటిలైట్ హ‌క్కులు రూ.30కోట్లు, డిజిట‌ల్ రైట్స్ రూ.10కోట్లు, హింది రైట్స్ రూ.10కోట్లు ప‌లుక‌గా, ఓవ‌రాల్‌గా రూ.110కోట్ల బిజినెస్ అయిన‌ట్లు సిని వ‌ర్గాల క‌థ‌నం. సినిమాకు ఖ‌ర్చు రూ.60కోట్లు ఖ‌ర్చు కాగా, బిజినెస్ రూ.110 కోట్లు. అంటే సినిమా విడుద‌ల కాక‌ముందే రూ.50కోట్ల లాభాలు అర్జించింది. కొస‌మెరుపు ఏంటంటే ఈ సినిమా అమెరికాలో 40 ఏరియాల్లో 150 థియోట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తున్నార‌ట‌.

సూర్య “ఎన్జీకే” రికార్డు స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share