క్రిష్‌కి బాల‌య్య అదిరిపోయే గిఫ్ట్‌..?

January 15, 2019 at 11:02 am

ద‌ర్శ‌కుడు క్రిష్‌.. టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ‌మైన డైరెక్ట‌ర్‌. తాను ప‌ట్టింద‌ల్లా బంగారం చేసుకునే ప‌నిత‌నం ఆయ‌న సొంతం. చారిత్ర‌క సినిమాలు అయినా.. సామాజిక ద‌`క్కోణం ఉన్న క‌థ‌నైనా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో.. అందులోనూ అతిత‌క్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేయ‌డంలోనూ ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పొచ్చు. ఒక‌రు వ‌దిలిపెట్టిన ప్రాజెక్టును టేక‌ప్ చేసి, దానిని విజ‌యవంతంగా పూర్తి చేయ‌డంలో క్రిష్ త‌న‌దైన మార్క్ చూపించాడు. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు జీవితాన్ని రెండు భాగాలుగా తెర‌పై ఆవిష్క‌రించాడు క్రిష్‌. ఇందులో మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అయి.. విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

అన్న‌గారి జీవితాన్ని తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించార‌ని ప‌లువురు ప్ర‌ముఖులు క్రిష్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించిన బాల‌య్య బాబు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో క్రిష్ దే కీల‌క పాత్ర అని ఆయ‌న కితాబిస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రిష్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని బాల‌య్య బాబు అనుకుంటున్నార‌ట‌. నిజానికి.. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాల‌కు క‌లిపి మొత్తం రూ.ప‌దికోట్లు క్రిష్‌కి రెమ్యూన‌రేష‌న్ ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌.

అయితే.. ఈ సినిమాను పూర్తి చేయ‌డంలో క్రిష్ చూపిన అంకిత‌భావానికి ముగ్ధడైన బాల‌య్య‌బాబు అద‌నంగా మ‌రో ఐదుకోట్ల రూపాయ‌లు పారితోషికం ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట‌. రెండు భాగాల‌ను ఏకంగా కేవ‌లం మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే పూర్తి చేయ‌డం, అదికూడా అన్న‌గారి జీవిత ఘ‌ట్టాల‌ను క్రిష్ ఆవిష్క‌రించిన తీరు బాల‌య్య‌బాబును ఎంతో ఆక‌ట్టుకుంద‌ట‌. ఇక రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కూడా విజ‌య‌వంతం అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఆయ‌న ఉన్నార‌ట‌. ఈ ఆనందంలో క్రిష్‌కు అదిరిపోయే కానుక ఇచ్చేందుకు బాల‌య్య నిశ్చయించుకున్నట్లు తెలిసింది.

క్రిష్‌కి బాల‌య్య అదిరిపోయే గిఫ్ట్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share