ఎన్టీఆర్ బయోపిక్..రానా లుక్ పై షాకింగ్ కామెంట్స్!

September 13, 2018 at 1:34 pm

తెలుగు తెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై ఎన్నోె అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ దర్శకులు క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మహానటులు ఎన్టీఆర్ పాత్రపోషిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు..ఏపి రాజకీయాల్లో కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఖ్యాతి ఆర్జించిన మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ అంటే సామాన్యమైన విషయం కాదు..అందులో పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఎస్వీఆర్ గా నాగబాబు, ఏఎన్ ఆర్ గా సుమంత్, శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో మరో ముఖ్యమైన పాత్ర చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపి సీఎం గా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ నిన్నరిలీజ్ అయ్యింది. అయితే రానా లుక్ పై సోషల్ మీడియాలో రక రకాలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. భళ్లాలదేవుడి లాంటి భయంకరమైన విలన్ పాత్రను పోసించిన రానా.. తన కెరీర్ లో మరో భయంకరమైన విలన్ పాత్రకు రెఢీ అయ్యాడంటూ ఫస్ట్ లుక్ స్టిల్ పై కామెంట్ చేశారు.

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని చేప్టటిన వైనాన్ని పలువురు ప్రస్తావించటం గమనార్హం. అంతే కాదు బాబులా కన్నింగ్ గా చూడటంలో రానా ఎందుకు పనికిరాదంటూ ఒక పంచ్ పడితే.. వెన్నుపోటు వాస్తవాలు తెలిసి మరీ బాబు పాత్రను రానా ఎందుకు ఒప్పుకున్నట్లు? అన్న ప్రశ్నను మరొకరు సంధించారు. వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి.. చంద్రబాబు గెటప్ తో కూడిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 80ల నాటి చంద్రబాబును గుర్తుకు తెచ్చేలా రానా గెటప్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హెయిర్ స్టైల్.. మీసకట్టును అనుకరించటంలో సక్సెస్ అయ్యారు.

ఇక చంద్రబానాయుడు మేనరీజం..నడక, నవ్వు ఎలా చూపించబోతున్నారో అందరికీ కుతూహలంగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే..నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా బాబా..అంతే కాదు తన కూతురుని వారి ఇంటి కోడలుగా పంపారు…పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఈ సమయంలో చంద్రబాబుని యాంటీగా చూపిస్తారా..పాజిటీవ్ గా చూపిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి రానాబాబు ఫస్ట్ లుక్ మీద పాజిటివ్ కామెంట్స్ కంటే పంచ్ లే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

werew

ఎన్టీఆర్ బయోపిక్..రానా లుక్ పై షాకింగ్ కామెంట్స్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share