ఆనందంలో ఎన్టీఆర్ ..డాక్టర్స్ తో సెల్ఫీ

June 14, 2018 at 9:37 pm

ఎన్టీఆర్ కొడుకు పుట్టిన విషయాని ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నారు .అయితే ఎన్టీఆర్ వారసుడు ఎలా ఉన్నాడు ఆనందంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు , అయితే ఎన్టీఆర్ తన రెండవ వారసుడు చూడటానికి రెయిన్ బో హాస్పటల్ కి వెళ్లారు . ఎన్టీయార్ భార్య లక్ష్మీ ప్ర‌ణ‌తి ఈ రోజు (జూన్ 14) పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు. ఈ విష‌యాన్ని ఎన్టీయార్ ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. ‘‘నా కుటుంబం మ‌రింత పెద్ద‌దైంది. బాబు పుట్టాడు’’ అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు ఎన్టీయార్‌కు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

 

హాస్పిటల్లో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా హైదరాబాద్ రెయిన్ బో హాస్పటల్ వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ తన రెండో వారసుడిని డాక్టర్ల సమక్షంలో దర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, ఎన్టీఆర్‌తో సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దీనిని చుసిన అభిమానులు ఖుషీగా ఫీల్ అవుతున్నారు .

ఆనందంలో ఎన్టీఆర్ ..డాక్టర్స్ తో సెల్ఫీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share