ప‌వ‌న్‌కు మ‌హేష్ స్పెష‌ల్ సర్ ప్రైజ్ ..!?

May 13, 2019 at 5:24 pm

బాక్సాఫీసులో భారీ వ‌సూళ్ళ‌తో దూసుకుపోతున్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమాను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప్ర‌త్యేక షో వేయించ‌నున్న‌ట్లు సినిమా స‌ర్కిల్‌లో వార్త చక్క‌ర్లు కొడుతుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌హ‌ర్షి సినిమాలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించారు. ఇంత‌కాలం స‌రియైన సినిమాలు లేక డీలా ప‌డిన మ‌హేష్‌బాబుకు మ‌హ‌ర్షీ సినిమా ఊపిరి పోసింది. మ‌హేష్‌బాబు ప‌రాజ‌యాల బాట నుండి విజయాల బాట ప‌ట్టించింది మ‌హ‌ర్షి సినిమా.

 

మ‌హ‌ర్షీ సినిమా మ‌హేష్‌బాబు కేరీర్‌లో ద బెస్ట్ సినిమాగా మిగిలిపోనున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేక‌పోవ‌డంతో మ‌హ‌ర్షీ సినిమా కు హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. మ‌హేష్‌బాబు కేరీర్‌కు మ‌ళ్ళీ ప్రాణం పోసిన ఈ సినిమాను ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి చూసారు. మెగాస్టార్ ఈ సినిమాను చూసిన మ‌హేష్‌బాబు న‌ట‌న కీర్తించాడు. మ‌హేష్ బాబు న‌ట‌న‌కు ఫీదా అయిన చిరంజీవి మ‌హేష్ కు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

 

ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతు వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంతో మ‌క్కువ‌. మ‌క్కువ కొద్ది ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో షూటింగ్‌లు, రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు లేని స‌మయంలో వ్య‌వ‌సాయ ప‌నులు చేస్తూ కాలం గ‌డుపుతారు. మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా నేప‌థ్యం కూడా వ్య‌వ‌సాయంకు సంబంధించిన‌ది కావ‌డంతో ఆ సినిమాను చూడాల‌ని మ‌హేష్ బాబు ప‌వ‌న్ ను కోరిన‌ట్లు వినికిడి. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఓ ప్ర‌త్యేక షో వేయ‌నున్న‌ట్లు సిని వ‌ర్గాల క‌థ‌నం.

ప‌వ‌న్‌కు మ‌హేష్ స్పెష‌ల్ సర్ ప్రైజ్ ..!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share