ఇక ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాసే !

June 19, 2019 at 12:21 pm

బాహుబ‌లి తెచ్చిన ఇమేజ్‌… బాహూబ‌లి 2 ఇచ్చిన కిక్‌తో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమాతో త‌న గ్రాఫ్‌ను మరింత పెంచుకున్నాడు. టాలీవుడ్ న‌టుడు ప్ర‌భాస్‌కు బాలీవుడ్‌లోనూ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతోంది. సాహో సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్ర‌యూనిట్ టీజ‌ర్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసింది. సాహో టీజ‌ర్‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌స్తోంది.

నెట్టింట్లో ఇప్పుడు మోస్ట్‌పాపుల‌ర్ టీజ‌ర్‌గా సాహో చిత్రం టీజ‌ర్ నిలుస్తుంది. సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో నిర్మాణ చేశారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున జ‌రిపేందుకు చిత్ర‌యూనిట్ సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మాత్రం మిలియ‌న్ల కొద్ది వ్యూస్ వ‌స్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప‌ట్ట‌రాని సంతోషంలో ఉంది.

తెలుగు మార్కెట్‌తో పాటు ద‌క్షిణాదిలోనూ ప్ర‌భాస్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. బాహూబ‌లితో ఆ ఫాలోయింగ్ ఆమాంతం బాలీవుడ్‌కు పాకింది. బాలీవుడ్‌లో ప్ర‌భాస్ సినిమా కోసం నీరిక్ష‌ణ త‌ప్ప‌డం లేద‌నే రేంజ్‌లో ఫాలోవ‌ర్లు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. సాహో సినిమా టీజ‌ర్‌కు తెలుగులో 25మిలియ‌న్ల వ్యూస్ రాగా, బాలీవుడ్‌లో 35మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. అదే విధంగా త‌మిళంలోనూ 15మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం కూడా విశేష‌మే. అంటే తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా ప్ర‌భాస్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఏర్ప‌డ్డార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. బాహుబ‌లి ఇచ్చిన కిక్‌తో సాహో సినిమాను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌య్యాడ‌న్న‌మాట.

ఇక ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాసే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share