రికార్డులకు ‘ సాహో ‘ … దుమ్ములేపుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్‌

June 13, 2019 at 2:19 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా ఆగ‌స్టు 15న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. రూ.
350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నా వాస్తవంగా అంత బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నారా ? లేదా అన్న సందేహం అయితే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో ఉంది. ఇక సాహో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్ స‌న్నిహితులు సాహోను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సాహో బిజినెస్ చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

ప్రి రిలీజ్ బిజినెస్‌లో సాహో రికార్డుల దిశ‌గా దూసుకుపోతోంది. యూవీ క్రియేష‌న్స్‌కు సొంత డిస్ట్రిబ్యూష‌న్ ఉంది. చాలా ఏరియాల్లో వీళ్లే సొంతంగా రిలీజ్ చేస్తారు. తెలుగు వెర్ష‌న్ కోసం ఎన్ని కోట్లు వీలు అయితే అన్ని కోట్లు రాబ‌ట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక (27 కోట్లు), ఈస్ట్, వెస్ట్ (20 కోట్లు) ఇచ్చేసారు. అలాగే సీడెడ్ ను 25 కోట్లకు అమ్మాల‌ని చూస్తున్నారు. ఈస్ట్‌, వెస్ట్ రూ.20 కోట్ల‌కు అమ్మారంటేనే ప‌రిస్థితి ఎలా ? ఉందో తెలుస్తోంది.

ఓవ‌రాల్‌గా ఆంధ్రా ఏరియా రూ.65 కోట్ల‌కు అమ్మిన‌ట్టు తెలుస్తోంది. ఇక నైజాం, వైజాగ్ దిల్ రాజు పంపిణీ చేస్తున్నాడు. బాహుబ‌లి పార్ట్ -1 సినిమా నేష‌న‌ల్ వైడ్‌గా రూ.150 కోట్లు…. రెండో భాగం రూ.250 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టాయి. సాహో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 125 కోట్ల వరకు బిజినెస్ టార్గెట్ తో మార్కెట్ చేస్తున్నారు. ఏదేమైనా సాహో ప్రి రిలీజ్ బిజినెస్‌లోనే రికార్డుల దుమ్ము రేపుతోంది. రేపు వ‌సూళ్ల‌లో ఎలా ? దుమ్ము రేపుతుందో ? చూడాలి.

రికార్డులకు ‘ సాహో ‘ … దుమ్ములేపుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share