యంగ్ డైరెక్టర్ కోసం టాలీవుడ్ హీరోలు క్యూ.. ఎవరో తెలుసా!

May 16, 2019 at 11:38 am

టాలీవుడ్‌లో టాప్ హీరోలు… ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నారు. అయినా మాకు క‌థ‌లు చూడండి… మాకోసం మంచి క‌థ‌లు త‌యారు చేయండి… మీ డైరెక్ష‌న్‌లో న‌టిస్తామ‌ని ఆ ద‌ర్శ‌కుడిని బ‌తిమాలుతున్నారు. ఆ హీరోల కాల్షీట్స్ కోసం పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డ‌తారు. అయినా ఈ హీరోలు స‌రే చూద్దాం లే అంటూ ఉంటారు. అలాంటి ఈ కుర్ర‌హీరోలు ఆ ద‌ర్శ‌కుడిని క‌థ‌ల కోసం అడుగుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది.

ఇంత‌కు ఎవ‌రా ద‌ర్శ‌కుడు, ఎవ‌రెవ‌రు ఆ కుర్ర‌హీరోలు. ఇటీవ‌ల మ‌జిలి సినిమా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించిన అక్కినేని నాగ‌చైత‌న్య, వ‌రుసగా హిట్‌ల మీద హిట్‌లు అందిస్తున్న శ‌ర్వానంద్‌తో పాటు నేచుర‌ల్ స్టార్ నానీలు మంచి క‌థ‌ల కోసం ఆ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర క్యూ క‌డుతుండ‌టం విశేషం. ఎవ‌రా దర్శకుడంటే అంటే ప్ర‌స్తుతం హీరో రాజ‌శేఖ‌ర్‌తో క‌ల్కి సినిమాను రూపొందిస్తున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. “ఆ” సినిమాను హీరో నాని నిర్మించ‌గా, ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో ప్ర‌శాంత్ వ‌ర్మ పేరు ఒక్క‌సారే టాలీవుడ్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

ఇక‌పోతే రాజ‌శేఖ‌ర్ సినిమా ప‌ట్టాలపై ఉండ‌గానే నానీతో సినిమా తీసేందుకు ప్ర‌శాంత్ వ‌ర్మ ముందుగానే క‌థ రెడి చేసి పెట్టార‌ట. క‌థ‌ను నానీకి ప్ర‌శాంత్ వ‌ర్మ వినిపించాడ‌ట‌. అది నానీ ఓకే చేయ‌డం జ‌రిగింద‌ట‌. సో.. నానీ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో సినిమా రాబోతుంద‌న్న మాట‌. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ ఇటీవ‌ల క‌ల్కి సినిమా ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల చేశారు. ప్ర‌శాంత్‌వ‌ర్మ మేకింగ్ చూసిన నాగ‌చైత‌న్య, శ‌ర్వానంద్‌లు మాకు మంచి క‌థ‌లు ఉంటే చూడండ‌ని అడిగార‌ట‌. దీనికి ప్ర‌శాంత్ వ‌ర్మ స‌రేన‌న్నార‌ట‌. ఏదేమైనా కల్కి సినిమా త‌ర్వాత నానీతో సినిమా చేయ‌డం ఖాయ‌మ‌ని తేలిపోగా, ఈ యువ హీరోలతో ఎప్పుడు సినిమా చేస్తాడో ప్ర‌శాంత్‌వ‌ర్మ… వేచి చూడాల్సిందే మ‌రి.

యంగ్ డైరెక్టర్ కోసం టాలీవుడ్ హీరోలు క్యూ.. ఎవరో తెలుసా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share