కమెడియన్ పృథ్వి పై “మెగా” నిషేధం

June 18, 2019 at 1:13 pm

ఏపీలో తాజా ఎన్నికలకు ముందు పలువురు సినిమా ఇండస్ట్రీ వాళ్లు వైసీపీకి వన్ సైడ్ గా సపోర్ట్ చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం టిడిపికే సపోర్ట్ చేస్తుంది అన్న నానుడి ఉంది. తాజా ఎన్నికల్లో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఇండస్ట్రీలో మెజార్టీ ఆర్టిస్టులు వైసిపికి ఓపెన్‌గా సపోర్ట్ చేశారు. ఇలాంటివారిలో జ‌గ‌న్‌ను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో ఆయన వైసీపీ విజయం కోసం రాష్ట్రం అంతటా ప్రచారం చేయడంతో పాటు…. అటు టిడిపి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

రాజకీయ నాయకులు అన్నాక‌ ఇలాంటి విమర్శలు… ప్రతివిమర్శలు కామన్. అయితే వీటిని మెగా ఫ్యామిలీ మాత్రం చాలా తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకనుంచి మెగా ఫ్యామిలీ సినిమాల్లో పృథ్వి కి ఎలాంటి రోల్స్ ఇవ్వకూడదని ఫ్యామిలీ హీరోలు నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ రోల్ కు ముందుగా పృధ్వీని తీసుకుని ఇప్పుడు తొలగించినట్టు తెలుస్తోంది.

గ‌తంలో ఈ పాత్ర గురించి త్రివిక్రమ్ పృధ్వీకి చెప్పటం… ఆయ‌న ఓకే చేయటం జరిగాయ‌ట‌. అయితే ఇప్పుడు స్క్రిఫ్ట్‌లో మార్పుల మీ రోల్ లేద‌ని త్రివిక్ర‌మ్ పృధ్వికి సున్నితంగా చెప్పాడంటున్నారు. అయితే దీని వెన‌క అల్లు అర్జున్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్త‌వ‌, అవాస్త‌వాలు ఎలా ? ఉన్నా ప్ర‌స్తుతం మాత్రం ఈ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే నిజం అయితే ఇక‌పై మెగా ఫ్యామిలీ సినిమాల్లో పృధ్వి క‌నిపించ‌డ‌ని కూడా అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు.

కమెడియన్ పృథ్వి పై “మెగా” నిషేధం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share