ముంబైని షేక్ చేస్తున్న ర‌జ‌ని కాంత్ …?

May 15, 2019 at 2:27 pm

ముంబై… ఇది దేశానికి అర్థిక రాజ‌ధాని. ఇది రౌడీలు, గుండాలు, డాన్‌ల‌కు అడ్డా. రౌడీలు గుండాల‌ ఆగ‌డాల‌తో, మాఫీయా డాన్‌ల చీక‌టి వ్యాపారాల‌తో నిత్యం బిజిగా ఉండే ఈ న‌గ‌రం. ఆర్థిక రాజ‌ధాని అక్ర‌మాలు, హ‌త్య‌లు, దోపిడీల‌తో అత‌లాకుత‌లం అవుతున్న ముంబై న‌గ‌రాన్ని కాపాడే వారే లేర‌ని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న త‌రుణంలో ఓ ఫ‌వ‌ర్‌పుల్ పోలీసాఫీస‌ర్ రంగంలోకి దిగుతాడు. అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డ‌తాడు. చీకటి సామ్రాజ్యం ఏలుతున్న డాన్‌లను అంతం చేస్తాడు. ముంబై న‌గ‌రాన్ని ప్ర‌శాంత న‌గ‌రంగా మార్చుతాడు.. అత‌డే ఫ‌వ‌ర్‌పుల్ పోలీసాఫీస‌ర్ ర‌జ‌ని.

నేను ఇందాక చెప్పింది నిజం కాదండి.. సినిమా జీవితం. ముంబై న‌గ‌రంలో రౌడీలు, గుండాలు, గ్యాంగ్‌స్ట‌ర్‌ల నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమా క‌థ‌. ఇంత‌కు ఈ సినిమాలో హీరో ఎవ‌ర‌నుకుంటున్నారు… మ‌న సూప‌ర్‌స్టార్ ర‌జ‌నికాంత్‌. ఓ ఫ‌వ‌ర్‌పుల్ పోలీసాఫీస‌ర్‌గా మ‌న‌ముందుకొస్తున్నాడు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో, అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతంలో ఈ సినిమా రూపొందుతోంది. ర‌జ‌నికాంత్ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది.

పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో ర‌జ‌నికాంత్ త‌న విశ్వ‌రూపం చూపించ‌నున్న‌డ‌ట‌. హీరో వెంక‌టేశ్ న‌టించిన ఘ‌ర్ష‌ణ సినిమా లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా న‌టించిన రోల్‌లాగానే ర‌జిని పాత్ర ఉంటుంద‌ని సిని వ‌ర్గాల క‌థ‌నం. అయితే ఘ‌ర్ష‌ణ‌లో వెంక‌టేశ్ సింగిల్ పాత్ర‌లోనే న‌టించాడు. ర‌జ‌నికాంత్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయ‌నున్నాడ‌ట‌. కొస‌మెరుపేంటంటే ఈ సినిమాకు ద‌ర్భార్ పేరును ఖ‌రారు చేశార‌ట‌. ముంబై న‌గ‌రంలో రౌడి రాజ్యంలో ర‌జ‌నికాంత్ త‌న ద‌ర్బార్‌ను నిర్వ‌హించ‌నున్నాడ‌న్న మాట‌.

ముంబైని షేక్ చేస్తున్న ర‌జ‌ని కాంత్ …?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share