రజిని,మురుగదాస్ కాంబినేష‌న్‌ క‌న్ఫ‌ర్మ్‌…ఇది పక్క మాస్

December 18, 2018 at 10:09 am

ద‌క్షిణాది స్టార్ డైరెక్ట‌ర్ల‌లో శంక‌ర్ త‌ర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు మురుగుదాస్‌. స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే సినిమాలు తీయ‌డంలో ఆయ‌న దిట్ట అని కీర్తి సంపాదించుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న విజ‌య్ హీరోగా తెర‌కెక్కించి విడుద‌లైన స‌ర్కార్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. చిత్ర వ‌ర్గాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.రూ.250కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ సినిమాలోని కొన్ని అంశాలు..ముఖ్యంగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ పాత్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉందంటూ రాజ‌కీయ నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చివ‌రికి అది మురుగుదాస్ అరెస్ట్‌కు య‌త్నం వ‌ర‌కు వెళ్లింది. అయితే మురుగుదాస్‌కు ఉన్న అభిమాన బ‌లాన్ని గ్ర‌హించి స‌ద‌రు రాజ‌కీయ నాయ‌కులు వెన‌క్కి త‌గ్గిన విష‌యం తెలిసిందే..

ఇక తాజా క‌బురేంటంటే ర‌జ‌నీ మురుగుదాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ఇప్ప‌టికే అటు ర‌జ‌నీ..ఇటు మురుగుదాస్ ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. అయితే అంద‌రూ అనుకున్నట్లుగా ఇది రాజ‌కీయ నేప‌థ్య చిత్రం మాత్రం కాదు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇక ఈ సినిమాకి యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ కంపోజ్ చేస్తున్నాడు. 2.ఓను నిర్మించిన లైకా ప్రోడ‌క్ష‌న్స్‌నే ఈ సినిమాను నిర్మించ‌నుండ‌టం విశేషం. అయితే వ‌రుస‌గా లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ చిత్రాల‌ను నిర్మిస్తోంది. ఇది కూడా అదే జాన‌ర్‌లో వ‌చ్చే భారీ చిత్రంగా ఉండ‌బోత‌న్న‌ది ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక రజినీ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పెటా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత రజినీ, మురుగదాస్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నారు.

2.ఓకు ముదు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రెండు సినిమాలు అప‌జ‌యాన్ని మూట‌గట్టుకున్నాయి. వాస్త‌వానికి ఈ రెండు సినిమాలు పక్కా మాస్ సినిమాలుగా హైప్ క్రియేట్ చేస్తూ మార్కెట్లోకి వ‌చ్చినా ఎంత‌మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత వ‌చ్చిన 2.ఓతో ర‌జ‌నీకి ఊర‌ట ల‌భించింది. ఇక ఇప్పుడు మురుగుదాస్ సినిమాతో మాస్ జాన‌ర్‌లో భారీ హిట్ కొట్టాల‌ని ర‌జ‌నీ త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ట‌. మ‌రి ఈసారైనా మాస్ జ‌నాన్ని అల‌రిస్తారో లేదో వేచి చూడాలి.

రజిని,మురుగదాస్ కాంబినేష‌న్‌ క‌న్ఫ‌ర్మ్‌…ఇది పక్క మాస్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share