రాజు గారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌…అస‌లేం జ‌రుగుతోంది

October 17, 2017 at 12:18 pm

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున – చెన్నై చిన్న‌ది స‌మంత మామాకోడ‌ళ్లుగా మారి వారం రోజులు కూడా కాకుండానే వాళ్ల‌కు టెన్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వీరిద్ద‌రిని టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు. ఈ మామాకోడ‌ళ్ల‌నే టెన్ష‌న్ పెడుతోన్న ఆ హీరో ఎవ‌రు ? ఆ క‌థేంటో ? చూద్దాం. నాగ్ – స‌మంత న‌టించిన రాజు గారి గ‌ది 2 సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో మంచి ఓపెనింగ్సే రాబ‌ట్టుకుంది.

మూడు రోజుల్లో రూ.11 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.12 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమాకు రూ.24 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఓ వైపు ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమాకు అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ షేర్ రాబ‌ట్టాలి. అయితే షాక్ ఏంటంటే వీక్ డేస్ స్టార్ట్ అవ్వ‌గానే సినిమా వీక్ అయ్యింది.

ఇక దీపావ‌ళి సంద‌డి చేసేందుకు బుధ‌వారం రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగిపోతున్నాయి. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన రాజా ది గ్రేట్ సినిమాతో పాటు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ డ‌బ్బింగ్ మూవీ అద‌రింది కూడా బుధ‌వార‌మే వ‌స్తోంది. ఈ రెండు సినిమాలు చాలా థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించ‌నున్నాయి. రాజా ది గ్రేట్ సినిమాను ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత చేయ‌డంతో ఈ సినిమా కోసం ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా వెయిట్ చేస్తోంది. మ‌రి రాజా సినిమా పోటీని త‌ట్టుకుని రాజు గారి గ‌ది 2 మ‌రో రూ.10 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం అంటే చాలా క‌ష్ట‌మే. మ‌రి ర‌వితేజ‌ను త‌ట్టుకుని ఈ మామాకోడ‌ళ్లు ఈ సినిమాను ఎంత వ‌ర‌కు సేఫ్ జోన్‌లోకి తెస్తారో ? చూడాలి

 

రాజు గారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌…అస‌లేం జ‌రుగుతోంది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share