మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

June 22, 2019 at 4:11 pm

మెగా అభిమానుల‌కు ఓ పండుగ‌లాంటి వార్త ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతుంద‌నే వార్త మెగా అభిమానుల‌కు కంటిమీద క‌నుకు లేకుండా చేస్తుంది. ఈ వార్త నిజ‌మే అయితే మెగా అభిమానుల‌కు పండుగే పండుగ‌.

జ‌న‌సేన పార్టీని స్ఠాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఘోర ప‌రాజ‌యం పొందాడు. ఆ పార్టీ నుంచి కేవ‌లం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల అనంత‌రం సినిమాల్లోకి వ‌స్తాడ‌ని అంతా భావిస్తున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం తాను సీరియ‌స్‌గానే రాజ‌కీయాలు చేస్తాన‌ని ఓ వైపు ప్ర‌క‌టిస్తున్నారు. అదే క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎన్నిక‌లకు ముందు రెండు భారీ ప్రాజెక్టుల‌కు సైన్ చేశాడ‌నే ప్ర‌చారం ఉంది. ఆ రెండు ప్రాజెక్టుల‌కు ప‌వ‌న్ సినిమాలు చేయాల్సి ఉంది.

ఇక మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యెందుకు సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్ ను ఇటీవ‌లే ప్రారంభించారు జ‌క్క‌న్న‌. ఈ చిత్రం కూడా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మే. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత బ్యాన‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియోటివ్స్ వ‌ర్క్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ తేజ్ న‌టించ‌నున్నాడ‌ని సిని వ‌ర్గాల్లో ప్రచారం జోరందుకుంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ మంచి క‌థ‌ను సిద్ధం చేసి ఇద్ద‌రితో సినిమాను రూపొందించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించేలా ఓ మంచి క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ను అడిగిందే త‌డువుగా క‌థ సిద్ధం చేసిన‌ట్లు వినికిడి. ఏదేమైనా ఈ వార్త నిజ‌మైతే బాగుండ‌ని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share