అదృష్టమంటే రామ్ చరణ్ దే !

January 17, 2019 at 2:02 pm

అచ్చిరాని పెళ్లికి వ‌చ్చిందే కానుక అంటే ఇదేనేమో.. కొన్నికొన్నిసార్లు సినిమాలు ఎంత చెత్త‌గా ఉన్నా.. అవి విడుద‌ల అయిన సంద‌ర్భాలే కాపాడుతాయి. పెట్టిన పెట్టుబ‌డిలో కొద్దోగొప్పో రాబ‌ట్టుకోవ‌డానికి చిన్న‌పాటి అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అయిన విన‌య విధేయ రామ సినిమా ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఈ సినిమా విడుద‌ల అయిన మొద‌టి షో నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాబోయ్ ఇక రెండో రోజు నుంచి థియేట‌ర్ల‌లో జ‌నం క‌న‌బ‌డ‌ర‌నే టాక్ వినిపించింది.

మొద‌టి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.25కోట్లు వ‌సూలు చేసింది. మిగ‌తా నాలుగు రోజుల్లో మ‌రో రూ.20కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టింది. ఈ శ‌ని, ఆదివారాల వ‌ర‌కు మొత్తం సుమారు రూ.60కోట్ల వ‌ర‌కు రాబ‌డుతుంద‌ని ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. నిజానికి.. ఈ సినిమాకు వ‌చ్చిన నెగెటివ్ టాక్ చూస్తే.. ఈ మాత్రం రావ‌డం కూడా గొప్పేన‌ని చెప్పొచ్చు. కానీ.. సంక్రాంతి పండుగ‌కు ఈ సినిమా విడుద‌ల కావ‌డం.. మాస్ హీరో రాంచ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి కావ‌డం వ‌ల్ల ఈ మాత్రం వ‌సూలు చేసింద‌ని ట్రేడ్‌వ‌ర్గాలు అంటున్నాయి.

నిజానికి.. రాంచ‌ర‌ణ్ హీరోగా, బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాపై మొద‌టి నుంచీ భారీ అంచ‌నాలు ఉన్నాయి. అదేమిటోగానీ.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్లో రాంచ‌ర‌ణ్‌ను బోయ‌పాటి చూపించిన తీరు నుంచే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ్డాయి. కానీ.. రాంచ‌ర‌ణ్‌, బోయ‌పాటి ఏదో మాయ చేస్తారని అంద‌రూ అనుకున్నారు. కానీ.. సినిమా మొద‌టి షో నుంచే.. ఇందులో ఏమీ లేద‌నే విష‌యం తేలిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తంగా అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింద‌ని చెప్పొచ్చు. ఏదేమైనా.. విన‌య విధేయ రామ‌ను సంక్రాంతి పండుగే కాపాడింది.

అదృష్టమంటే రామ్ చరణ్ దే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share