ర‌ష్మీక వెంట ప‌డుతున్న టాలీవుడ్ టాప్ హీరోస్ …!

May 12, 2019 at 11:19 am

ర‌ష్మీక మందాన ఈ పేరు ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. అర్జున్‌రెడ్డి అలియ‌స్ విజ‌య్ దేవ‌రకొండ‌కు జ‌త‌గా గీత గోవిందం లో న‌టించిన హీరోయిన్ అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టెస్తారు. గీత గోవిందం సినిమాతో ఒక్క‌సారే ర‌ష్మీక మందాన అదృష్ట జాతకం మారిపోంద‌నే చెప్పాలే. గీత గోవిందం సినిమాలో ర‌ష్మీక అంద‌చందాల‌ను, హావ‌భావాల‌ను, ఆమే న‌ట‌న‌తో యూత్‌కు పిచ్చెక్కించింది. ఆ పిచ్చి ఇప్పుడు మ‌న టాలీవుడ్ టాప్ హీరోల‌కు ప‌ట్టుకుంది.

ర‌ష్మీక మందాన వెంట‌ప‌డుతున్నారు మ‌న టాప్ హీరోలు. కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టిన ర‌ష్మీక ఇప్పుడు టాప్ హీరోల‌ను గిలిగింత‌లు పెడుతుంద‌ట‌. ఆమే కోసం యువ టాప్ హీరోలు వెంట‌ప‌డుతున్నార‌ని సిని వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.. ర‌ష్మీక త‌న ప‌క్క‌న న‌టించాల‌ని అందుకు ఆమేతో ఒప్పించాల‌ని టాప్ హీరోలు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అడుగుతున్నార‌ట‌.

ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా సాధించిన విజ‌యం ఉత్సాహంలో మునిగి తేలుతున్నాడు. మ‌హ‌ర్షి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మ‌హేష్‌బాబు నూత‌న ఉత్సాహంతో మ‌రో సినిమాకు రెడి అవుతున్నాడు. మ‌హేష్ బాబు న‌టించ‌బోయే త‌దుప‌రి చిత్రంలో ర‌ష్మీక మందాన ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌ధ్యంలో తీయ‌బోయే సినిమాలో ర‌ష్మీక మందాన‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఏదేమైనా ర‌ష్మీక మందానా ఈ టాప్ హీరోల‌తో సినిమాలు పూర్తి చేస్తే ఆమేకు టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా మార‌నున్న‌నే టాక్ వినిపిస్తుంది.

ర‌ష్మీక వెంట ప‌డుతున్న టాలీవుడ్ టాప్ హీరోస్ …!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share