పాకిస్తాన్ పాకిన సాహో ఫీవ‌ర్‌

July 13, 2019 at 5:05 pm

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సాహో ఫీవ‌ర్ ఇప్పుడు పాకిస్తాన్‌కు పాకింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో మానియాలో ఊగిపోతుంది. ఓవ‌ర్సీస్‌లో భారీ బిజినెస్ చేస్తున్న సాహో సినిమా ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. సాహో చిత్ర బృందం విడుద‌ల చేసిన సైకో స‌యాన్ పాట ఇప్ప‌డు పాకిస్తాన్‌లో దుమ్ము దులుపుతుంద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా పాకిస్తాన్ దేశ సిని హీరోయిన్ మ‌వ్రా హుకెన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.

డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా త‌రువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్ర‌భాస్ ప్ర‌భ‌ను కొన‌సాగిస్తుండ‌గా, ఇప్పుడు శత్రుదేశంగా పిలుచుకునే పాకిస్తాన్‌లో కూడా త‌న ప్ర‌తాపాన్ని చూపుతున్నాడు ప్ర‌భాస్‌. బాహుబ‌లి సినిమాతో పాకిస్తాన్‌లో అనేక మంది అభిమానుల‌ను ప్ర‌భాస్ సంపాదించుకున్నాడ‌ట‌ని అర్థ‌మ‌వుతుంది.

పాకిస్తాన్‌లో హ‌ల్‌ఛ‌ల్ చేస్తున్న సాహో సినిమా పాట‌కే ఇంత రెస్పాన్స్ వ‌స్తుంటే ఇక సినిమా విడుద‌లైతే ప‌రిస్థితి ఏమిట‌న్న‌దే అర్థం కావ‌డం లేద‌ట చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రికి. సాహో సినిమా కూడా బాహుబ‌లి రేంజ్‌లో ఉంటే పాకిస్తాన్ లో కూడా ప్ర‌భాస్ మానియాకు తిరుగులేన్న‌ట్లే. ఇక ఈ సినిమా ఆగ‌స్టు 15న విడుదల కానున్న‌ది. ఈ సినిమా విడుద‌ల కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక పాకిస్తాన్ ప్ర‌జ‌లు కూడా సోష‌ల్ మీడియా ద్వారా సినిమాను చూడ‌నున్నార‌ని అర్థం అవుతుంది.

పాకిస్తాన్ పాకిన సాహో ఫీవ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share