సాహో ఫ్రీరీలిజ్ బిజినెస్ ఎంతో తెలుసా…?

June 19, 2019 at 1:41 pm

సాహో సినిమా… ఈ సినిమా విడుద‌ల కోసం కోట్లాది మంది అభిమానులు క‌ళ్ళు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సినిమా సాహో. ఈ సినిమా నిర్మాణం గ‌త రెండున్న‌రేళ్ళుగా సాగుతూనే ఉంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టులు, టెక్నిషియ‌న్స్‌తో స‌రికొత్త హంగుల‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే కోట్లు కొల్ల‌గొడుతోంది. ఆగ‌స్టు 15న విడుద‌ల‌తో సాహో బిజినెస్ ఏ రేంజ్‌లో సాగుతుందోన‌నేది చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నానుతోంది.

బాహుబ‌లి సినిమా ఇచ్చిన కిక్‌తో సాహో సినిమా లో న‌టించిన యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ కోట్లు కొల్ల‌గొట్టాడు. బాహుబ‌లి సినిమా విడుద‌ల అయిన త‌రువాత ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అభిమానుల‌ను పెంచుకున్నాడు ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ సాహో సినిమా నిర్మాణం గ‌త రెండున్న‌రేళ్ళుగా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికి గాని సాహో సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో ఇక సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. దీంతో పాటు సినిమా ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల‌పై దృష్టి పెట్టింది.

సాహో సినిమాను రూ.300కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించారు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే పెట్టిన బ‌డ్జెట్‌ను దాటేసింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే థ్రియోటిక‌ల్ రైట్స్‌తోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.320కోట్ల బిజినెస్ జ‌రిగింద‌ట‌.
ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే 20కోట్ల‌కు పైగా లాభాల్లోకి వ‌చ్చిన సాహో సినిమా విడుద‌ల త‌రువాత ఇంకా ఎంత బిజినేస్ చేస్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఫిలిం వ‌ర్గాల్లో నెల‌కొంది. అదే విధంగా శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ బిజినెస్ రూ.200కోట్ల‌కు పైగా సాగుతుంద‌నే అంచనాలో ఉంది చిత్ర‌యూనిట్‌. సాహో టీజ‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న‌తో ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది.

ఏపి/తెలంగాణా : 120 కోట్లు
తమిళనాడు, కేరళ : 25 కోట్లు
కర్ణాటక : 29 కోట్లు
నార్త్ ఇండియా : 100 కోట్లు
ఓవర్సీస్ : 45 కోట్లు
వరల్డ్ వైడ్ : 320 కోట్లు

సాహో ఫ్రీరీలిజ్ బిజినెస్ ఎంతో తెలుసా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share