‘ సాహో ‘ టీజ‌ర్: క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌… సెక‌న్ టు సెక‌న్ ఉత్కంఠే

June 13, 2019 at 11:14 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 15న వ‌స్తోన్న ఈ సినిమా టీజ‌ర్ గురువారం రిలీజ్ అయ్యింది. 1.38 నిమిషాల నిడివి ఉన్న టీజ‌ర్ మొత్తం క‌ళ్లు మిరుమిట్లు గొలిపే యాక్ష‌న్‌తో నింపేశారు. సెక‌న్ మిస్ అయినా మంచి యాక్ష‌న్ మిస్ అయిన‌ట్టే టీజ‌ర్ ఉంది.

టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌, ప్రభాస్‌ హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. కథా కథనాలపై కూడా హింట్‌ ఇచ్చి సినిమా మీద అంచనాలను పెంచేశారు. ఒక నిమిషం 40 సెకన్ల టీజర్‌లో యాక్షన్స్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలిచాయి. కార్‌, బైక్ చేజింగ్ సీన్లు హైలెట్‌గా నిలిచాయి.

టీజ‌ర్ మొత్తం యాక్ష‌న్‌తో ఉండ‌డంతో ఎక్క‌డ ? ఏం జ‌రుగుతుందో అర్థం కావ‌డం లేదు. సినిమా ఆద్యంత యాక్ష‌న్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా సాహో టీజ‌ర్‌తోనే సాహో అనిపించేశాడు. ఇక ఆగ‌స్టు 15న అదిరిపోయే యాక్ష‌న్ చూసేందుకు ప్రేక్ష‌కుడు రెడీ అయిపోవ‌డ‌మే మిగిలి ఉంది.

‘ సాహో ‘ టీజ‌ర్: క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌… సెక‌న్ టు సెక‌న్ ఉత్కంఠే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share