మెగా హీరో టీజర్ కి సన్నద్దం!

March 12, 2019 at 3:44 pm

టాలీవుడ్ లో మెగా హీరోలు ఇప్పటి వరకు ఎంతో మంది వస్తున్నారు. వీరిలో మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో ఘన విజయం అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన అరడజను సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

దాంతో మనోడి కెరీర్ ప్రమాదంలోపడింది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ రూపొందుతోంది. విధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ .. వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యూత్ మనసులను కొల్లగొట్టేస్తుందని అంటున్నారు. కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్ ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మెగా హీరో టీజర్ కి సన్నద్దం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share