సమ్మోహనం TJ రివ్యూ

June 15, 2018 at 12:57 pm

TJ రివ్యూ: స‌మ్మోహ‌నం

 

టైటిల్‌: స‌మ్మోహ‌నం

బ్యాన‌ర్‌: శ‌్రీదేవి మూవీస్‌

న‌టీన‌టులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, , త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు త‌దిత‌రులు

మ్యూజిక్‌: వివేక్ సాగ‌ర్‌

ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

సినిమాటోగ్ర‌ఫీ: పి.జి.విందా

నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌

రిలీజ్ డేట్‌: 15 జూన్‌, 2018

 

అష్టాచమ్మా, జెంటిల్‌మన్‌, అమీతుమీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ తాజాగా తెర‌కెక్కించిన క్లాస్ ల‌వ్‌స్టోరీ స‌మ్మోహ‌నం. సుధీర్‌ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్ల నుంచే ఆక‌ట్టుకుంది. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుంది ? అన్న‌ది  TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ :

విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న ఆర్‌.విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజ్జు (సుధీర్‌ బాబు). విజ్జు తండ్రి సర్వేష్ (సీనియర్‌ నరేష్‌)  సినిమాల మీద ఇష్టంతో వ‌లెంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. ఓ సినిమా షూటింగ్ టీం షూటింగ్ కోసం స‌ర్వేష్ ఇల్లు అడుగుతుంది. త‌న‌కు సినిమాలో క్యారెక్ట‌ర్ ఇచ్చే కండీష‌న్ మీద స‌ర్వేష్ షూటింగ్ కోసం ఇల్లు ఇస్తాడు. ఆ సినిమా షూటింగ్‌లో హీరోయిన్  సమీరా రాథోడ్‌ (అదిది రావు హైదరీ) తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది ప‌డుతుండ‌గా విజ్జు ఆమెకు కోచింగ్ ఇస్తాడు. ఈ క్ర‌మంలోనే ఒక‌రిమీద మ‌రొక‌రికి ఇష్టం క‌లుగుతుంది. ఆమె కోసం విజ్జు కులుమ‌నాలి వెళ్లి త‌న ప్రేమ విష‌యం ఆమెకు చెపుతాడు. స‌మీరా మాత్రం విజ్జు మీద అలాంటి అభిప్రాయం లేద‌ని చెప్ప‌డంతో విజ్జు ఆమోపై కోపం పెంచుకుంటాడు. అస‌లు స‌మీరా విజ్జును ఎందుకు కాదంది ?  అలా విడిపోయిన వారిద్ద‌రు చివ‌ర‌కు ఎలా క‌లిశారు ? అన్న‌దే అస‌లు క‌థ‌.

 

విశ్లేష‌ణ – పాజిటివ్‌లు :

సినిమాల మీద పెద్ద‌గా ఒపీనియ‌న్ లేని హీరోకీ, న‌ట‌నే ప్రాణంగా భావించి స‌క్సెస్‌లో ఉన్న అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ‌. మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి క‌థే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. బ‌ల‌మైన క‌థ‌కు పాత్ర‌లు, ఎమోష‌న్‌, ఫ‌న్ ఇలా అన్ని క‌ల‌గ‌లిపి అద్భుతంగా ఉంది. సినిమా క‌థ‌తో పాటే ప్రేక్ష‌కుడు ట్రావెల్ చేస్తాడు. విజయ్‌ పాత్రలో సుధీర్‌ బాబు ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అ‍ద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్‌ ఇమేజ్‌, ప్రేమ, వేధింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా న‌టించింది. హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్‌ హుందాగా కనిపించారు. నిజ జీవితంలో స్టార్స్ ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏంటి అనే సున్నితమైన అంశాన్ని ఎంతో కన్విన్సింగా డీల్ చేశారు ఇంద్రగంటి.

 

నెగిటివ్‌లు :

ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ సినిమాల విష‌యంలో ప్ర‌ధాన కంప్లెంట్ స్లో నెరేష‌న్‌. ఈ సినిమా క‌థ‌నం కూడా చాలా చోట్ల స్లో అవుతుంది. కొన్ని స‌న్నివేశాల‌ను అవ‌స‌రానికి మించి సాగ‌దీశారు. సెకండాఫ్ సాధార‌ణంగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. 

 

టెక్నిక‌ల్‌గా….

టెక్నిక‌ల్‌గా సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాగ‌ర్ సంగీతం బాగుంది. నేప‌థ్య సంగీతం బాగా కుదిరింది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడా ట్రిమ్‌గానే ఉన్నా ద‌ర్శ‌కుడు సాగ‌దీత స‌న్నివేశాలు ఉన్నా ఎడిట‌ర్‌ను త‌ప్పుప‌ట్ట‌లేం. ద‌ర్శ‌కుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దరాయన. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను ప్ర‌జెంట్ చేశాడు.

 

TJ సూచ‌న‌: స‌మ్మోహ‌న‌మే

 

TJ స‌మ్మోహ‌నం రేటింగ్‌: 3 / 5

సమ్మోహనం TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share